ఏపీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 9గంటలకే  అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ప్రారంభించారు.. ఇకపోతే ఈ సమావేశాలు 9 రోజుల పాటు  కొనసాగనున్న ఈ సమావేశాల కోసం అధికార, ప్రతిపక్షాలు సమరానికి సన్నద్ధం అయ్యాయి. సమావేశాల సందర్భంగా.. ఆర్టీసీ ఛార్జీల రెగ్యులేటరీ కమిషన్‌ ఏర్పాటు బిల్లు సహా పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం..

 

 

వీటితో పాటుగా బస్సు ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ప్రశ్నలు సంధించే అవకాశం ఉండగా. మద్యం విక్రయాల్లో అక్రమాలు, అక్రమ నిల్వను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తుంది.. ఇకపోతే ఈ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సమయంలో  విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) పై ప్రతిపక్షం అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌ సమాధానం ఇచ్చారు.  

 

 

పీపీఏలపై అత్యున్నతమైన కమిటీ సమీక్ష చేస్తోందని, ప్రభుత్వం నిజా నిజాలను ఒక పద్దతి ప్రకారం పరిశీలన చేస్తోందన్నారు. ఇక అన్ని విషయాలను కమిటీ నివేదిక రాగానే  బయటకు చెబుతామని, పద్దతి ప్రకారం జరగాలంటే కొంత సమయం పడుతుందని మంత్రి వివరించారు. ఇకపోతే శీతాకాల సమావేశాల్లో తొలిరోజే రచ్చకు తెర తీసాడు నిమ్మల రామానాయుడు.

 

 

ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన విధివిధానాలను తప్పుబట్టిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పీపీఏల పై ఆరు నెలల్లో ఏంచేశారని ప్రశ్నల వర్షం కురిపించారు.ఇదే కాకుండా కేంద్రం పీపీఏల పై వేసిన కమీటీపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అంటూ ఈ ఒప్పందాలపై చర్చను లేవనెత్తారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. ఇకపోతే కమీటి నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని అప్పటి వరకు ఎలాంటి విమర్శలు చేయకూడదని అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా ప్రస్తావించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: