అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబునాయుడు ఆటలు సాగినట్లు లేదు. 10 రోజుల అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చంద్రబాబు పెద్ద వ్యూహాన్నే రచించారు. సమావేశం మొదటిరోజు నుండే అనేక అంశాల్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయలని 21 మంది ఎంఎల్ఏలను బృందాల వారీగా బాధ్యతలు కూడా అప్పగించారు. చంద్రబాబు ఎటూ అధ్యక్షుడే కాబట్టి, గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీని  సస్పెండ్ చేశారు కాబట్టి మిగిలింది 21 మంది ఎంఎల్ఏలే ఉన్నారు.

 

సరే ఎంఎల్ఏలతో ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా సమావేశాలు మొదలయ్యేసరికి అవన్నీ గాలికి కొట్టుకుపోయాయి. ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ రంగంలో పిపిఏ సమీక్షలు, స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టటం లాంటి అంశాలు చర్చకు వచ్చాయి. అయితే ఆ అంశాలపై టిడిపి సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు వేసిన ప్రశ్నలకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, కన్నబాబు ఎంఎల్ఏలు శ్రీకాంత్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, అంబటి రాంబాబు,  జోగిరమేష్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ధీటుగా సమాధానాలిచ్చారు.

 

టిడిపి ఎంఎల్ఏల ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు చెప్పటమే కాకుండా  రాష్ట్ర విభజన చట్టం అమలుకు చంద్రబాబు వల్ల జరిగిన నష్టం, ప్రత్యేకహోదాకు చేసిన ద్రోహం, మోడిని అప్పట్లో తిట్టి ఇపుడు పొగడ్డం, ఓటుకునోటు కేసులో దొరికిపోయి హైదరాబాద్ ను వదిలేసి విజయవాడకు పారిపోయి వచ్చేయటం లాంటి అంశాలను కూడా ప్రస్తావించారు.

 

మంత్రులు, అధికారపార్టీ సభ్యుల ధీటైన సమాధానాలకు, ఎదురు ఆరోపణలకు టిడిపి నుండి సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. ఓటుకునోటు కేసు గురించి కన్నబాబు మాట్లాడుతున్నపుడు చంద్రబాబు అండ్ కో నుండి అసలు ప్రతిఘటనే కనబడలేదు. గడచిన ఐదేళ్ళల్లో అనేక అంశాల్లో చంద్రబాబు తీసుకున్న యూటర్న్ లను కన్నబాబు వివరిస్తుంటే టిడిపి ఎంఎల్ఏలు నోరుకూడా విప్పలేకపోయారు. అంటే టిడిపి ఎంఎల్ఏల్లో ఎంతమంది సభలోకి వచ్చారో కూడా తెలియలేదు. అలాగే చాలామంది ఎంఎల్ఏలు చంద్రబాబుకు మద్దతుగా నిలబడకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: