దేశవ్యాప్తంగా ఉల్లిధరలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఉల్లికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  దీంతో సామాన్య ప్రజలకు భారంగా మారిపోయింది  ఉల్లి. ఏకంగా వంద రూపాయల నుంచి 200 మధ్య ఉల్లి ధర  ఉండటంతో సామాన్య ప్రజలు జంకుతున్నారు.ఉల్లిని కొనాలంటేనే  కనీసం వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంత మంది సామాన్య ప్రజలు అయితే ఉల్లిని  కొనలేక.... ఉల్లి లేకుండానే వంటలను కానిచ్చేస్తున్నారు. ఆకాశాన్నంటిన ఉల్లి ధరలు ప్రస్తుతం సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కాస్తోకూస్తో రేట్లు పెరిగితేనే బెంబేలెత్తి పోయే సామాన్య ప్రజలు ఇప్పుడు ఉల్లి ధర ఏకంగా ఆకాశాన్నంటడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 

 

 

 

 అయితే భారీగా పెరిగిన ఉల్లి ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉల్లిని  సబ్సిడీ కింద తక్కువ ధరలకే అందజేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో  జగన్ సర్కార్ కూడా  రాష్ట్రంలో భారీగా ఉల్లి ధర  పెరగడంతో సబ్సిడీ కింద ఇరవై ఐదు రూపాయలకే రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఉల్లిని  ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఒక వినియోగ దారునికి ఒక కిలో చొప్పున ఉల్లిని  అందజేస్తోంది జగన్ సర్కార్. అయితే వందరూపాయల నుంచి 200 రూపాయల వరకు పలుకుతున్న ఉల్లిని  ఒక సామాన్య ప్రజలకు  ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీపై ఉల్లిని  కొనేందుకు రైతుబజార్లో క్యూ కడుతున్నారు ప్రజలు . 

 

 

 

దీంతో  రైతు బజార్లలో తోపులాటలు కూడా జరుగుతున్నాయి. కేవలం ఇరవై ఐదు రూపాయలకే ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిని రైతు బజార్లలో అందజేస్తున్నడంతో భారీ మొత్తంలో ప్రజలు అక్కడకు చేరి  జనసంద్రంగా మారిపోతుంది. చివరికి ఉల్లి కాస్త ఓ వృద్ధుడి  ప్రాణాన్ని బలిగొంది. తక్కువ ధరకే ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిని  అందజేస్తున్నడంతో రైతు బజార్లలో కొనుగోలు చేసేందుకు వచ్చిన ఆ వృద్ధుడు క్యూ లైన్ లో నిలబడ్డాడు. అయితే రైతుబజార్లో అప్పటికే చాలామంది ప్రజలు అక్కడికి చేరుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో ఊపిరాడక అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించాడు ఆ వృద్ధుడు . గుడివాడ రైతు బజార్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: