క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  ఎన్నికలకు ముందు తర్వాత పాల్ అనుసరిస్తున్న విధానం చూసిన వారు పాల్, పవన్ వైఖరుల్లో తేడాను మాట్లాడుకుంటున్నారు. ఒకపుడు పాల్ కూడా నోటికొచ్చినట్లు మాట్లాడేవారు.  ట్రంపును అమెరికా అధ్యక్షుడిగా చేసింది తానే అని చెప్పాడు. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలను తానే ఆపినట్లు చెప్పుకున్నాడు. అసలు తాను గనుక  లేకపోతే ప్రపంచం ఏమైపోయేదో అని ఆందోళన వ్యక్తం చేసేవాడు.

 

ఇక పవన్ విషయం చూస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే తానే కారణమన్నాడు. తన వల్లే వైసిపి అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిందన్నాడు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి తానొక్కడినే పోరాటాలు చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. సకల సమస్యలకు తన దగ్గర పరిష్కారాలున్నట్లు మాట్లాడుతున్నారు.

 

ఎన్నికలకు ముందు కూడా జగన్ గురించి పవన్ చాలా విషయాలే మాట్లాడారు. ఎన్నో అంశాల్లో చంద్రబాబునాయుడును నిలదీయాల్సిన పవన్ కేవలం జగన్ ను టార్గెట్ చేసుకున్న విషయం అందరూ చూసిందే. సరే ఏదో ఎన్నికల సమయం కాబట్టి మాట్లాడుతున్నారులే అని అనుకున్నారు. కానీ ఎన్నికలైపోయిన తర్వాత కూడా తన ధోరణిలో ఏ విధమైన మార్పు కనబడలేదు.

 

ఎన్నికలైపోయిన తర్వాత కేఏ పాల్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారు. ఏ రాజకీయ నేత గురించి కూడా నోరిప్పటం లేదు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో పాల్ కు కానీ ఆయన పార్టీకి గాని  అసలు డిపాజిట్టే రాలేదు.  ఈ విషయంలో జనసేన కాస్త నయం. 140 సీట్లలో పోటి చేసి ఒక్కస్ధానంలో గెలిచింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పోటి చేసిన రెండు చోట్లా పవన్ చిత్తుగా ఓడిపోయారు. ఎన్నికల్లో జనాలు తిరస్కరించినా పవన్ ధోరణిలో మాత్రం ఎటువంటి మార్పు కనబడలేదు. అందుకనే పవన్ కన్నా కేఏ పాలే నయమని జనాలు అనుకుంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: