ఏపీలో ఐదేళ్లుగా ఎక్కడి సమస్యలు అక్కడే ట్రాఫిక్‌లా జాం అయ్యాయి.. దుర్బిణి పెట్టి వెతికినాకనిపించని అభివృద్ధి జాడలు, రాజకీయాల్లో నీతి మంతులు , నైతికత పాటించే వారు జల్లడ పట్టిన కనిపించని వైనం. అప్పటి పాలకుల హామీలు ప్రకటనలకే పరిమితం కాగా, ప్రస్తుతం ప్రభుత్వం మారింది. మారిన ప్రభుత్వం ఏయే అభివృద్ధి పనులను చేపట్టింది. ఇప్పటి వరకు అవలంభించిన ప్రణాళికలు ఏంటనేది ఇప్పుడు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చర్చకు రానున్నాయని సమాచారం.

 

 

ఇకపోతే అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఉల్లి, నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై వినూత్నంగా నిరసన తెలిపింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెడలో ఉల్లిపాయ దండలతో అసెంబ్లీకి వచ్చారు.. ప్లకార్డులతో నిరసనను తెలిపారు. దీంతో అసెంబ్లీ గేటు దగ్గర భద్రతా సిబ్బంది టీడీపీ ఎమ్మెల్యేల ను అడ్డుకున్నారు. ఇకపోతే టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. ఉల్లి ధరలపై వినూత్నంగా తమ నిరసనను తెలియజేశారు.

 

 

ఈ క్రమంలో ఉల్లి దండలు, ప్లకార్డులకు అనుమతి లేదని పోలీసులు తెలుపడంతో వారితో టీడీపీ ఎమ్మెల్యేలకు కాసేపు వాగ్వాదం జరిగింది. ఇకపోతే టీడీపీ ఉల్లి, నిత్యావసర వస్తువుల ధరల పెంపు అంశంపై అసెంబ్లీలో ప్రస్తావించాలని నిర్ణయం తీసుకుంది. ఇదే కాకుండా వివిధ వర్గాలప్రజలకు సంబంధించి మొత్తం 21 అంశాలను సమావేశాల్లో లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది టీడీపీ.

 

 

ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదల, అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పనులను ప్రభుత్వం నిలిపివేయడంపై సభలో గళమెత్తేందుకు సిద్ధమవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలల సమయం అయిపోయినందున ఇప్పుడు ప్రభుత్వ పనితీరుపై గట్టిగా నిలదీయాలని చంద్రబాబు తన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారని వినికిడి..

మరింత సమాచారం తెలుసుకోండి: