ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు  మొదలయ్యాయి. జగన్ ప్రభుత్వం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ కూడా జగన్ ప్రభుత్వ పాలన లోని లోపాలను ఎండగడుతూ పలు ప్రశ్నల్ని సన్ దించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం కూడా చేసారు. కాగా  ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు మొదలవగా టిడిపి ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.కాగా  అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు జరుగుతూ ఉన్నాయి.

 

 

 

 ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని కానీ ఇప్పటి వరకు ప్రత్యేక హోదా గురించి ఎక్కడ మాట్లాడలేదని టిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. అసలు జగన్ కు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకోచ్చే ఉద్దేశం ఉందా లేదా అంటూ ప్రశ్నించారు. అయితే దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్నలకు దీటైన సమాధానం ఇచ్చారు.  విభజన చట్టం గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదు అని ఎమ్మెల్యే కన్నబాబు అన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో టీడీపీ ఎన్నో సార్లు రాష్ట్ర ప్రత్యేక హోదాపై యూ టర్న్ తీసుకుందని ఆయన సమాధానం ఇచ్చారు. 

 

 

 

 అయితే రాష్ట్ర ప్రత్యేక హోదా కల్పించేందుకు వచ్చిన అవకాశాలు అన్నింటిని టిడిపి దుర్వినియోగం చేసిందని అన్నారు . గతంలో తమ ప్రభుత్వ హయాంలో టిడిపి కి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ టిడిపి పార్టీ మాత్రం ప్రత్యేక హోదా విషయంలో ఎన్నో యుటర్న్ తీసుకుందని కానీ ఇప్పుడు వచ్చి  టీడీపీ నీతులు  చెబుతోంది అంటూ కన్నబాబు వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పారిపోయి వచ్చారని... అలాంటి చంద్రబాబు కు రాష్ట్ర విభజన చట్టం గురించి మాట్లాడే హక్కు లేదు అంటూ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: