ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో మహిళా భద్రత గురించి ఆంధ్రప్రదేశ్ హోం మినిస్టర్ మేకతోటి సుచరిత ప్రసంగిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉల్లిపాయల ధరల విషయంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీలో గందరగోళం వాతావరణం సృష్టించడంతో వెంటనే రంగంలోకి దిగిన సభాధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ కచ్చితంగా ఉల్లిపాయల ధర విషయంలో చర్చ జరుగుతుందని మాట్లాడుతూ అన్ని విషయాలలో చర్చలు జరపాలని సభ సజావుగా సాగాలని మహిళా భద్రత గురించి మాట్లాడుతున్న సమయంలో ఇట్లాంటి గందరగోళ వాతావరణం సృష్టించడం సబబు కాదని పేర్కొనటం జరిగింది.

 

అయినా గాని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు గోల గోల చేయడంతో… అసలు ప్రతిపక్ష నేత చంద్రబాబు కి సంబంధించిన హెరిటేజ్ కంపెనీ లో ఉల్లిపాయల ధర చూస్తే కిలో 135 రూపాయలు ఉందని కానీ మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఇరవై ఐదు రూపాయలకే కిలో ఉల్లిపాయలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. కావాలని ప్రజల దృష్టి మరల్చడానికి సభా సమయాన్ని వృధా చేయటం కోసం చంద్రబాబు మరియు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని జగన్ పేర్కొన్నారు.

 

ఉల్లిగడ్డల విషయంలో భారత దేశంలోనే కేవలం 25 రూపాయలకు అతి తక్కువ ధరకు మన ప్రజలకు మనం అందిస్తుంటే ఇంకా దానికి చర్చ ఎందుకని ప్రజలకు మేలు చేస్తుంటే వీళ్లు తట్టుకోలేక పోతున్నారని అసెంబ్లీ లో తెలుగుదేశం పార్టీ నాయకుల పై మండిపడ్డారు జగన్. దేశంలో ఆడవాళ్లపై అత్యంత దారుణంగా అత్యాచారాలు జరుగుతున్న ప్రస్తుత సమయాలలో మహిళా భద్రత గురించి హోం మంత్రి  మాట్లాడుతున్న తరుణంలో చంద్రబాబు మరియు ఆయన పార్టీకి చెందిన నాయకులు ఈ విధంగా వ్యవహరించడం దారుణమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: