హైదరాబాద్ షాద్నగర్ లో  వైద్యురాలు దిశను నలుగురు నిందితులు పథకం ప్రకారం అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే దిశా  ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అత్యాచారం చేసిన నిందితులకు వెంటనే శిక్ష విధించకుండా ఆలస్యం చేస్తుండటంపై ఒక్కసారిగా దేశం భగ్గుమంది. అయితే దిశా  కేసులోని  అత్యాచార నిందితులకు అతి దారుణంగా శిక్షించాలంటూ దేశ ప్రజానీకం డిమాండ్ చేసింది. మరోసారి ఆడపిల్లలపై చేయి  చేయాలంటేనే భయపడేలా నిందితులకు శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ దేశ ప్రజానీకం మొత్తం నిరసనలు తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేశారు. 

 

 

 కేస్ రీ  కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితుడు తమ వద్ద నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారని  అందుకే నిందితులను ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని ఇప్పటికే సీపీ సజ్జనార్ నిందితుల ఎన్కౌంటర్పై వివరణ ఇచ్చారు. అయితే నిందితుల ఎన్కౌంటర్పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ అని కొందరు... లేదు చట్టాన్ని అతిక్రమించి ఎన్కౌంటర్ చేశారని మరికొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై మహిళా సంఘాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. నిందితులు ఎన్కౌంటర్లను  తప్పుగా భావించి హైకోర్టులో మహిళా సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. కాగా దీని పై ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు విచారణ చేపట్టనుంది  హైకోర్టు. 

 

 

 

 ఇదిలా ఉండగా వైద్యురాలు దిశగా హత్యాచారం కేసులోని నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ ని తప్పుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.  సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు సుప్రీం కోర్టులో ప్రస్తావన జరిగింది. దీనిపై విచారణను అత్యవసరంగా జరపాలని పిటిషనర్  జీఎస్ మని  కోరారు. దిశ కేసులోని నలుగురు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని ఆయన తెలిపారు. ఎన్కౌంటర్లపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ పోలీసులు పాటించకుండానే ఎన్కౌంటర్లు చేశారు అని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతోందని సీజేఐ బాబ్డే  అన్నారు. జీఎస్ మనీ పిటీషన్పై ఈనెల 11న విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: