ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షం ఉల్లిపాయల మీద ఏదైతే సబ్జెక్ట్ తీసుకొని వస్తున్నారో ఆ ఉల్లిపాయలపై చర్చ జరపటానికి సిద్ధంగానే ఉన్నామని జగన్ అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చెయ్యని కార్యక్రమాలు మా ప్రభుత్వం చేస్తోందని జగన్ అన్నారు. ఉల్లి గురించే మాట్లాడుతున్నానని దేశం మొత్తం మీద ఏపీలో మాత్రమే కేజీ 25 రూపాయలకు ప్రజలకు అందుతోందని జగన్ అన్నారు. 
 
ఇంత తక్కువ రేటుకు ఉల్లిని అమ్ముతున్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమే అని సీఎం జగన్ అన్నారు. ప్రతి రైతు బజార్ లోను  25 రూపాయలకే కేజీ ఉల్లిని అమ్ముతున్నామని జగన్ చెప్పారు. ఇప్పటివరకు 36,536 క్వింటాళ్లు కొనుగోలు చేసి రైతు బజార్లలో కేజీ 25 రూపాయలకు అమ్ముతున్నామని జగన్ అన్నారు. సోలాపూర్, అల్వాల్ నుండి కూడా ఉల్లిని కొనుగోలు చేసున్నామని సీఎం జగన్ చెప్పారు. 
 
ఎక్కడ ఉల్లి దొరికితే అక్కడ ఉల్లిని కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఉల్లి పంట రైతులకు గిట్టుబాటు కాక పొలాల్లోనే వదిలేసిన పరిస్థితిని చూశామని చెప్పారు. ఈరోజు రైతులకు గిట్టుబాటుధర లభిస్తోందని, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జగన్ చెప్పారు. చంద్రబాబు హెరిటేజ్ షాపులో కేజీ ఉల్లి 200 రూపాయలకు అమ్ముతున్నారని జగన్ అన్నారు. 
 
200 రూపాయలకు అమ్ముతున్న మీరా మాట్లాడేది అని జగన్ అన్నారు. మీరు చేసే పనులకు న్యాయం, ధర్మం ఉందా అని జగన్ అన్నారు. మహిళల భద్రత గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. మహిళల భద్రత గురించి లోతైన చర్చ జరగాలని చట్టం కూడా తీసుకొనిరాబోతున్నామని సీఎం జగన్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ వరకు జరగనున్నాయి. బీఏసీ సమావేశంలో సభ్యులు మొత్తం ఏడు పనిదినాలు సభ నిర్వహించాలని నిర్ణయించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: