దేశవ్యాప్తంగా  సంచలనం  సృష్టించిన   శంషాబాద్  దిశా  హత్యాచారం కేసు లో  దోషులుగా  వున్న   నలుగురు నిందితులను  శుక్రవారం  తెల్లవారుజూమున పోలీసులు  ఎన్ కౌంటర్  చేసి  హతమార్చిన  సంగతి తెలిసిందే. అయితే నిందితుల  బంధువులు మాత్రం  కోర్టు తీర్పు  రాకముందే  ఎలా చంపుతారని  ధర్నాలకు దిగారు. 
 
 
ఈనిందితులల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య  రేణుక  సంచలన ఆరోపణలు చేసింది.  నా భర్త ను వేడి నీళ్లు పోసి  దారుణంగా  హిసించారని  నాకు  తెలిసింది. అయినా నా భర్త తప్పు చేశాడని  ఊరుకున్న  నా ముఖం చూసైనా   నా భర్త ను వదిలేస్తారనుకున్న  కానీ  కోర్టు తీర్పు కూడా రాకముందే  అన్యాయంగా  కాల్చి చంపారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ? నా అన్న వాళ్ళు లేకుండా పోయారు, నన్ను కూడా చంపేయండి లేదంటే నేనే ఆత్మహత్య చేసుకుంటోవాలా అంటూ రేణుక విలపించింది.  ఇక  మావాడిని అన్యాయంగా ఎన్ కౌంటర్ పేరుతో చంపేశారని లోకం ఒత్తిడి వల్లే ఇదంతా జరిగిందని  చెన్నకేశవులు తల్లి , సోదరి ఆరోపించారు. 
 
 
ఇదిలావుంటే  ఈ ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రస్తుతం  విచారణ  చేపడుతుంది.  అందులో భాగంగా  నిందితుల కుటుంబసబ్యులను ఆదివారం  హైదరాబాద్ కు తీసుకెళ్లి తెలంగాణ పోలీస్ అకాడమీలో  జాతీయ మానవ హక్కుల కమిషన్  ముందు  వీరిని హాజరుపరిచారు. అనంతరం వారి దగ్గర్నుండి  నిందితుల  వ్యక్తిగత సమాచారం రాబట్టారు. ఈ ఎన్ కౌంటర్ పై ఏమైనా అనుమానాలున్నాయా అని పదే పదే వారిని ప్రశ్నించారని సమాచారం.  ఇక తమ బిడ్డలను కనీసం చివరి సారి చూసుకోకుండా  చేశారు.  కోర్టు తీర్పు వచ్చాక  వారిని శిక్షించాల్సిందని నిందితుల కుటుంబ సభ్యులు  మానవ హక్కుల  కమిషన్  ముందు వాపోయినట్లు తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: