ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో  నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. జనవరిలో మెగా డిఎస్సీ నిర్వహించి 7900 పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. విద్యార్ధులు, ఉపాధ్యాయుల రేషియోకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని జగన్ ఆదేశాలకు అనుగుణంగానే స్కూళ్ళల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.

 

ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రతిశాఖ కూడా రిక్రూట్మెంట్ క్యాలండీర్ ను తయారు చేసుకోవాలని జగన్ గతంలోనే ఇచ్చిన ఆదేశాలను పాటించబోతున్నట్లు చెప్పారు. వచ్చిన ఖాళీలను వచ్చినట్లు భర్తీ చేయటంలో బాగా క్యాలండీర్ ఆఫ్ రిక్రూట్మెంట్ పద్దతిని తయారు చేస్తున్నట్లు ఆదిమూలపు చెప్పారు.

 

ఉపాధ్యాయుల స్ధితిగతులను మెరుగుపరిచేందుకు 15 వేల పోస్టులకు ప్రమోషన్లు కూడా ఇచ్చామన్నారు. 16 ఏళ్ళుగా తెలుగు భాషా పండితులకు అందని ప్రమోషన్లను కూడా తమ ప్రభుత్వం ఆరుమాసాల్లోనే ఇచ్చేసినట్లు తెలిపారు. ఎస్జీటి, స్కూలు అసిస్టెంట్ ఉపాధ్యాయులకు కూడా ప్రమోషన్లు ఇవ్వటానికి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే వివిధ క్యాటగిరీల్లోని టీచర్ల నియామకాలకు కూడా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

 

స్కూళ్ళల్లో మెరుగైన పరిస్ధితులను కల్పించటంలో భాగంగానే 7 వేల అకడమిక్ ఇన్ స్ట్రక్టర్లను కూడా నియమించబోతున్నట్లు ప్రకటించారు. మొత్తానికి జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి స్కూళ్ళలో మెరుగైన పరిస్ధితులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నాడు-నేడు అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు.

 

జగన్ తీసుకుంటున్న ఇటువంటి చర్యలన్నీ సహజంగానే చంద్రబాబునాయుడుకు ఇష్టం ఉండదు. అందుకనే స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టడాన్ని తప్పు పడుతూ అసెంబ్లీలో గోల మొదలు  పెట్టించారు.   అయితే ప్రభుత్వం తరపు నుండి గట్టిగా సమాధానం రావటంతో చేసేది లేక నోరు మూసేశారు టిడిపి సభ్యులు. మొత్తం మీద అనవసర విషయాల్లో రాద్దాంతం చేయాలని ప్రయత్నించిన చంద్రబాబు అండ్ కో అసెంబ్లీ భంగపాటే ఎదురైందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: