ఒక వైపు ప్రపంచం మొత్తంలో ఉన్న దాదాపు ప్రజలు పోర్న్ ఇండస్ట్రీని బ్యాన్ చేయాలని కంకణం కట్టుకుంటుంటే కొందరు పని కట్టుకుని మరీ తాము పోర్న్ వీడియోల్లో నటిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే సమాజంలో పోర్న్ వల్ల జరుగుతున్న నష్టాన్ని గాని. మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని గాని అంచనా వేయడం కష్టం అవుతున్న దశలో ఇలాంటి వాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.

 

 

పోర్న్ వల్ల లోకంలోని యువతతో పాటుగా వయస్సుపడిన వారు వీటికి బానిసగా మారి చేస్తున్న వికృతచేష్టలకు ఇప్పటికే అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇకపోతే జేసన్ డెరూలో అనే ప్రముఖ అమెరికన్ సింగర్ చెడ్డీ వేసుకుని దిగిన ఫొటోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ ఆ ఫొటోను తొలగించింది. ఎందుకు అని ప్రశ్నించగా.. ఆ ఫొటోలో జేసన్ అభ్యంతకర రీతిలో కనిపిస్తున్నాడని, అలాంటి అసభ్యకరమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ తీసుకోదని హెచ్చరించింది. అంతవరకు బాగానే ఉంది గాని ఆ ఫోటో చూసిన పోర్న్ ఇండస్ట్రీ నుంచి జేసన్‌కు కుప్పలు తెప్పలుగా అవకాశాలు వెలువడుతున్నాయట.

 

 

ఇదే కాకుండా జేసన్ ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవడంతో పోర్న్ ఏజెన్సీలు వీడియోల కోసం ఆయన వెంటపడు తున్నాయి. అతని చేత పోర్న్ వీడియోలు చేయించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ పోర్న్ ఏజెన్సీ జేసన్‌కు 5 లక్షల డాలర్లు ఇస్తామని అంది. దీనికి సంబంధించిన వార్తను ది సన్ సంస్థ ప్రచురించింది. అయితే దీనిపై స్పందించిన జేసన్‌, ఈ ఆర్టికల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘నాకు ఆ డబ్బు సరిపోదు. అంతకంటే ఎక్కువ ఇస్తే పోర్న్ వీడియోలు చేస్తాను’ అన్నారు.

 

 

ఇకపోతే తన ఫొటోను డిలీట్ చేసినందుకు జేసన్ మండిపడుతున్నాడు. తనకు సహజంగా వచ్చిన అవయవాలపై అభ్యంతరం చెప్పడానికి ఇన్‌స్టాగ్రామ్ ఎవరని ప్రశ్నించారు. జేసన్‌కు ఫ్యాన్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ లభించింది. సమానత్వంపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తో చర్చించడానికి సిద్ధంగానే ఉన్నట్లు జేసన్ తెలిపారు. తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎనేబుల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక హాలీవుడ్‌లో ఇతని ఫొటో గురించే  దాదాపు వారం రోజులగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ..

మరింత సమాచారం తెలుసుకోండి: