బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ చరిత్ర సృష్టిస్తున్న విషయం. అంతేకాకుండా రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ఇప్పటికే పార్లమెంట్ లో పలు కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేయించింది . కాగా ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో  మరో కీలక బిల్లును ప్రవేశపెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. పౌరసత్వ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమనా  పౌరసత్వ సవరణ బిల్లు ఏ ఒక్క వర్గానికి కూడా వ్యతిరేకం కాదంటూ తెలిపారు. దేశంలోని మైనారిటీలకు ఈ బిల్లు వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. 

 

 

 

 అయితే లోక్సభలో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధించి ఎలాంటి ప్రశ్న అడిగిన తాను సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని అమిత్ షా  వ్యాఖ్యానించారు. కానీ ఈ విషయంపై ఏ పార్టీ కూడా వాకౌట్ చేయవద్దని ఆయన కోరారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లులో పలు కీలక మార్పులు చేసి ప్రవేశపెట్టింది. గతంలో పదకొండేళ్ల పాటు దేశంలో కొనసాగితేనే భారత దేశ పౌరసత్వాన్ని పొందే హక్కు ఉండేది.. కానీ ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా అయిదేళ్లకు కుదించింది ఎన్డీఏ ప్రభుత్వం. 

 

 

 2014 సంవత్సరంలో డిసెంబర్ 31 లోపు దేశానికి వలస వచ్చిన వారందరికీ భారత పౌరసత్వాన్ని కల్పించేందుకు అవకాశం కల్పిస్తూ పౌరసత్వ సవరణ బిల్లులో  కీలక మార్పులు చేసింది. అయితే పార్లమెంటులో ఈ బిల్లుపై ఆమోదముద్ర పడితే... అక్రమ వలసదారులుగా  వారిపై నమోదైన కేసులు అన్నిటినీ ఎత్తివేసే అవకాశం ఉంది. అస్సోమ్,  మేఘాలయ త్రిపుర మిజోరం ప్రాంతాల్లోని గిరిజనులకు మినహాయింపు ఉంది. అయితే ఈ బిల్లుపై ఇతర పార్టీలన్నీ వ్యతిరేకతతో  ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ బిజెపి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయించాలని ప్రయత్నాలు జరుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: