చలికాలపు చలిమంటలు ఏపీలో మొదలయ్యాయి. అక్కడి అసెంబ్లీలో మొదలైన శీతాకాల సమావేశాల తొలిరోజు వైఎస్సార్‌సీపీ - టీడీపీ  మధ్య మాటల యుద్ధం వాడీ-వేడిగా జరుగుతున్నాయి. పీపీఏలు, ప్రత్యేక హోదా, విభజన సమస్యలు.. ఇలా వరుసగా సభలో చర్చ నడుస్తోంది. బీఏసీ సమావేశం నిర్వహించిన తర్వాత సభ తిరిగి ప్రారంభం అయ్యాక.. ఉల్లి ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు సంబంధించి కీలక చర్చ జరుగుతుందని ప్రకటించారు.

 

 

కానీ టీడీపీ ఉల్లి  ధరలపై చర్చకు పట్టుబట్టింది.. ఈ క్రమంలో సభను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇకపోతే ఇన్నాళ్లుగా ఎక్కువగా ప్రజల నోళ్లల్లో నానిన రోజా గత కొన్ని రోజులుగా మౌనంగా ఉంటువస్తుంది. ఇక ఆమౌనం వీడినట్లుగా ఉంది. చంద్రబాబుని వాషింగ్ మిషిన్‌లో వేసి తిప్పినట్లుగా తన నోటితో చెడామడా కడిగేస్తుంది. ఉల్లిగడ్దల మీది నుండి వచ్చిన చర్చలో చంద్రబాబు తనయున్ని ఉద్దేశించి. పప్పుకు పప్పులో ఉల్లి లేదని బాబుగారు చాలా బాధ పడుతున్నట్లుగా ఉన్నారు. అని ఎద్దేవా చేశారు. ఇదే కాకుండా చంద్రయ్య పాలనలో అసలు మహిళలను మహిళలుగా చూడలేదని ఆడవారిని చులకన చేసే విధంగా బాబు పాలన సాగిందని తన మాటల బాణాలను వదిలింది.

 

 

ఇకపోతే దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రమే కిలో ఉల్లిని రూ. 25కు అమ్ముతుంటే చంద్రబాబు హెరిటేజ్‌ షాపులో కేజీ ఉల్లి రూ.200లకు అమ్ముతున్నారని ఇలాంటి వ్యక్తి జగన్ పాలనను విమర్శించే స్దాయికి ఇంకా చేరుకోలేదని రోజా పేర్కొన్నారు.. ఇకపోతో హైదరాబాద్‌లో జరిగిన దిశా ఘటన ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు రోజా.. ఇదే కాకుండా తన పాలనలో మహిళల భద్రత గురించి చేసిన ప్రణాళికల వివరాలను బాబు గారు ఒక్క సారి చెప్పాలని అన్నారు. మొత్తానికి బాబు గారిపై రోజా పెద్ద పెద్ద బాంబులే పేల్చారని అర్ధం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: