అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ విజయ రెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. పట్టపగలు తహసిల్దార్ కార్యాలయం లోకి వచ్చి తహసీల్దార్ విజయరెడ్డిపై  పెట్రోల్ పోసి తగలపెట్టి నిందితుడు  ఆత్మహత్య యత్నం చేయడం సంచలనం రేపింది. అయితే ఈ ఘటనలో తహసిల్దార్ విజయ రెడ్డి అక్కడికక్కడే సజీవదహనం  అయిపోగా నిందితుడు సురేష్ కొన్ని రోజుల పాటు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే రెవెన్యూ వ్యవస్థను ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది ఈ ఘటన. ఈ ఘటనను నిరసిస్తూ అటు  రెవెన్యూ సంఘాలు కూడా కొన్ని రోజులపాటు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇక ఈ ఘటన తర్వాత రెవెన్యూ అధికారులు అందరూ భయంతోనే  ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 


 ఎందుకంటే రోజుకు చాలా మంది ప్రజలు తమ దగ్గరికి పనుల కోసం వస్తుంటారు ... దీంతో ఎవరు ఎటు వైపు నుంచి దాడి చేస్తారనే భయం తోనే ఉద్యోగాలు చేస్తూన్నారు. దీంతో అటు రైతులు కూడా తహసిల్దార్ కార్యాలయంలో కి  పెట్రోల్ కి వెళ్లినా ఘటనలు జరిగాయి . ఇక్కడ ఓ రైతు అదే చేసాడు. తన భూ సమస్యలు పరిష్కరించాలంటూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు ఓ రైతు. 

 

 

 అయినా ఆ రైతు యొక్క భూ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ రైతు తహసిల్దార్ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా లోని మానవపాడు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను శరీరంపై పోసుకున్న రైతు శేఖర్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే గమనించిన పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఆ రైతును  అడ్డుకున్నారు. తన భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో నే ఆత్మహత్య చేసుకుంటున్నానని రైతు ఆవేదన వ్యక్తం చేయగా అతను భూ సమస్యలు పరిష్కరిస్తాం అని అధికారులు నచ్చ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: