మనం మామూలుగా అరటి పండ్లు  చూస్తూనే ఉంటాం  తింటూనే ఉంటాం. అయితే మిగతా పండ్ల కంటే అరటి పండ్లు కాస్త తక్కువ రేట్ లో ఉంటాయి కాబట్టి ఎక్కువగా పండ్లు తినడానికి ఆసక్తి చూపుతారు. ఇక్కడ ఓ వ్యక్తి అలాగే అరటి  పండు కనిపించడంతో తినేసాడు. కానీ ఆ తర్వాత దాని ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి. అరటిపండు ధర ఎంత ఉంటుంది మా అంటే  10, 20 రూపాయలు ఉంటుంది అంతే కదా అంటారా... అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇక్కడ ఉన్న  అరటిపండు ధర 85 లక్షలు. ఏంటి అవాక్కయ్యారా... ఇక్కడ చదివిన మీరు అవ్వక్కయినట్లే అక్కడ అరటి పండు తిన్న ఆ వ్యక్తి ఇలాగే  అవాక్కయ్యాడు. 

 


 అరటిపండు ధర ఐదు లక్షలు ఏంటి అంటారా... ఈ అరటిపండు కథ ఏంటో తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. ఈ అరటిపండు ధర డాలర్లలో 1.2 లక్షల డాలర్లు అదే మన కరెన్సీలో 85 లక్షలు. అయితే అయితే ఇక్కడున్న అరటిపండు ఏదో ప్రత్యేకమైన అరటి పండు కాదండోయ్... మామూలుగా మనం రోజూ చూసే సాదా సీదా  అరటిపండే. కానీ దీని ధర మాత్రం 85 లక్షలు. అమెరికా మియామీ బీచ్ బేసల్ షోలో అరటిపండు గోడకి డక్ట్  టేపుతో అతికించి అరటిపండు రేటు 85 లక్షలు గా ఫిక్స్ చేశారు నిర్వాహకులు. అయితే ఈ షోలో పాల్గొన్న చాలా మంది అన్ని వస్తువులను చూసినట్లే ఆ అరటి పండును  చూస్తూ ముందుకి వెళ్ళిపోతున్నారు. 

 

 కానీ డేవిడ్  అనే ఫర్ఫార్మెన్స్ ఆర్టిస్టు మాత్రం బాగా ఆకలితో ఉన్నట్టున్నారు. అరటి పండు ని చూడగానే టేపును తొలగించేసి అరటి పండును హాం ఫట్ అని అనిపించేసాడు . టేస్ట్ బాగుంది అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టేసాడు. కానీ ఆ తర్వాత తన తిన్నది 85 లక్షల ఖరీదైన అరటిపండు అని  నిజం తెలిసాక అవాక్కై పోయాడు ఆ వ్యక్తి. నా దగ్గర అంత డబ్బులేదు అంటూ నిర్వాహకులని వేడుకున్నాడు. అప్పటికే చుట్టుపక్కల వారు అతన్ని చూసి తెగ నవ్వుకుంటున్నారు.. ఇది గమనించిన నిర్వహకులు  ఇకది  నుంచి వెళ్లిపోవాలంటూ చెప్పేశారు. ఇక అతను వెళ్ళిపోయాక అక్కడ అలాంటిది వేరే అరటిపండును అతికించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: