ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలిరోజే సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా హాజరయ్యారు. అయితే ఆయన టీడీపీ బెంచీల వైపు వెనుక వరుసలో వంశీ కూర్చున్నారు. టీడీపీకి రాజీనామా చేయడం.. ఇటు వైసీపీలో చేరకపోవడంతో.. అటు ఇటు కాకుండా టీడీపీ సభ్యులు కూర్చున్న వెనుకవైపు బెంచీలో కూర్చున్నారు. ప్రస్తుతం విద్యుత్ ఒప్పందాలపై చర్చ జరుగుతోంది.

 
కాగా.. తాను త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నానని.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డితోనే తన పయనమని వంశీ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో పాటు వైసీపీకి చెందిన కీలకనేతలతో వంశీ పలుమార్లు వంశీ భేటీ అయ్యారు. సమావేశాల అనంతరం వంశీ వైసీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.


తొలిరోజు సభకు వచ్చిన వల్లభనేని అసెంబ్లీలో టీడీపీ బెంచీల వైపు వెనుక వరుసలో కూర్చున్నారు. ఏమిటంటే... అసెంబ్లీ రికార్డుల ప్రకారం వంశీ టీడీపీ సభ్యుడిగానే ఉండటంతో.. వంశీ టీడీపీ బెంచ్‌లలో వెనుక వైపు కూర్చున్నారు. టీడీపీ సభ్యులతో కూడా పెద్దగా మాట్లాడలేదు. మరోవైపు వల్లభనేని వంశీని టీడీఎల్పీ కార్యాలయంలోకి రావాలని తోటి ఎమ్మెల్యేలు కోరారు.. వంశీ సున్నితంగా తిరస్కరించారు. తర్వాత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా తమ కార్యాలంయలోకి రావాలని కోరగా ఆయన స్పందించలేదు. దీంతో వల్లభనేని వంశీ కాస్త అయోమయంలో పడ్డారనే చెప్పాలి.


అంతేకాదు వల్లభనేని.. ఇలా టీడీపీ వరుసలో కూర్చోడం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అనే కోణంలో చర్చ జరుగుతోంది. టీడీపీ బెంచ్‌ల వైపు నుంచి వంశీ ప్రభుత్వానికి మద్దతుగా తన వాయిస్ వినిపించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో విప్ వంటి అంశాలు కూడా అడ్డంకిగా ఉండవంటున్నారు విశ్లేషకులు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే విప్‌ ను ఇచ్చే అధికారం ఉంటుంది కాబట్టి.. ఎమ్మెల్యేగా సభలో వల్లభనేని తన అభిప్రాయం చెప్పే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: