ఎంతో ఉత్కంఠ రేపిన కర్నాటక ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రి యడ్యూరప్ప గండాన్ని గట్టెక్కినట్లే అనుకోవాలి. మొత్తం 15 నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి 12 చోట్ల గెలిచింది. యడ్యూరప్ప సిఎంగా కంటిన్యు అవ్వాలంటే కనీసం ఐదు నియోజకవర్గాల్లో గెలిచితీరాలి.  అలాంటిది ఏకంగా 12 నియోజకవర్గాల్లో గెలవటంతో యడ్యూరప్ప ఊపిరి పీల్చుకున్నారు.

 

నిజానికి ఉపఎన్నికలు అధికారపార్టీకి అనుకూలంగా ఉంటుందనటంలో ఎవరికీ సందేహం లేదు. అందులోను చావో రేవో తేల్చుకోవాల్సిన ఉపఎన్నికలంటే అధికారంలో ఎవరున్నా మొత్తం గెలుకుకోవటానికి పెద్ద ప్రయత్నమే చేస్తారు. ఇందులో భాగంగానే యడ్డీ కూడా మెజారిటి స్ధానాల్లో గెలుపుకోసం పెద్ద కసరత్తే చేశారు. సరే జనాలు కూడా సానుకూలంగానే స్పందించటంతో 12 స్ధనాలు గెలుచుకున్నారు.

 

ఉపఎన్నికల ఫలితాల్లో తేడా వస్తే  రెండోసారి ముఖ్యమంత్రిగా రాజీనామ చేయాల్సిన పరిస్దితిలో యడ్యూరప్పున్నారు. అందుకనే వ్యక్తిగతంగా ఉపఎన్నికల్లో గెలుపును ప్రిస్టేజ్ గా తీసుకున్నారు. కాంగ్రెస్ రెండు స్ధానాల్లో గెలవగా ఇతరులు ఓ స్ధానంలో గెలిచారు. మొత్తం మీద నష్టపోయిందెవరంటే జేడిఎస్ అధినేత, మాజీ సిఎం కుమారస్వామి మాత్రమే.

 

ఉపఎన్నికల్లో గెలుపుపై యడ్యూరప్ప మాట్లాడుతూ వెలువడిన ఫలితాలు తనకు చాలా సంతోషంగా ఉన్నాయన్నారు. ప్రజలు మంచి తీర్పిచినట్లు చెప్పారు. సరే ఫలితాలు ఎలాగూ బిజెపికి అనుకూలంగానే ఉంది కాబట్టి తన పాలనను మెచ్చే జనాలు బిజెపిని గెలిపించినట్లు ఆయన చెప్పుకోవటంలో తప్పేమీ లేదు.

 

నిజానికి ఇన్ని స్ధానాల్లో బిజెపి గెలుస్తుందని కమలం పార్టీ నేతల్లోనే చాలామంది ఊహించలేదు. అప్పట్లో కాంగ్రెస్, జేడిఎస్ లో ఉంటూ యడ్యూరప్పకు మద్దతు పలికిన కారణంగానే వారిపై అనర్హత వేటు పడింది. దాంతో 15 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు అనివార్యమైంది.

 

యెల్లాపూర్, రెనెబెన్నూరు, విజయనగర, మహాలక్ష్మీ లేఅవుట్, చిక్కబళ్ళాపూర, కేఆర్ పుర, కేఆర్ పేట, అథని, గోకక్, హిరేకెరూర, యశ్వంతపుర, కగ్వాడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజెపి గెలిచింది. శివాజినగర, హున్సూరు స్ధానాల్లో కాంగ్రెస్ గెలిచింది. హోస్కోటె నుండి ఇండిపెండెట్ గెలిచారు. ఇంత టైట్ గా జరిగిన ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్ధి గెలవటమే ఆశ్చర్యం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: