ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అయిన వైసీపీ పార్టీలో జగన్ నిర్ణయమే ఫైనల్... పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్న పార్టీ నేతలందరూ దానికి కట్టుబడి ఉంటారు. కానీ ఈ మధ్య ఓ వైసీపీ ఎంపీ మాత్రం అధినేత జగన్ ఆదేశాలను  భేఖాతరు చేస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే దీనిపై అధినేత జగన్ పలుమార్లు ఆ ఎంపీ తో చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. దీంతో సరికొత్త ప్లాన్ తో వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ముందుకు తెలుస్తోంది. అయితే రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఉండాలి. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇదే చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 

 నర్సాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు వైసీపీ లోకి తీసుకురావాలని వైసీపీ నేతలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు అంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. కొన్ని రోజుల్లో నర్సాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు వైసీపీలో చేరబోతున్నారని  అంటూ ఆంధ్ర రాజకీయాల్లో పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ఊహాగానాలు వెనుక అసలు కారణం ఏమిటంటే సొంత పార్టీ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు వైఖరి అని అనుకుంటున్నారు. గత కొంతకాలంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీరుతో అధినేత జగన్మోహన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో తమ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  ఆయన  వ్యాఖ్యలు... ఆయన వ్యవహార శైలితో  అధినేత జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. 

 


 అయితే రఘురామకృష్ణంరాజుకు  జగన్ చాలా సార్లు చెప్పిన తీరు మారలేదని.. పలుమార్లు రఘురామకృష్ణంరాజు పై పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్లాస్ కూడా తీసుకున్నారంటే అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా రఘురామకృష్ణంరాజు గత కొన్ని రోజుల నుండి బీజేపీకి టచ్ లో ఉంటున్నారని  అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా నరసాపురం లో మరో నేతను వైసీపీ లోకి తీసుకు రావాలి అంటూ అధినేత జగన్ ప్లాన్ వేశారని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నర్సాపురం మాజీ ఎంపీ గోకరాజు రంగరాజు వైసీపీ లోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. గోకరాజు గంగరాజు వైసీపీ లోకి తీసుకురావడం వల్ల అటు బిజెపికి  ఇటు రఘురామకృష్ణంరాజుకు చెక్ పెట్టొచ్చని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: