ఆయ‌న టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీని సైతం త‌ట్టుకుని విజ యం సాధించిన త‌మ్ముడు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ అదినేత జ‌గ‌న్‌పై ప్రశంస‌ల జ‌ల్లు కురి పించారు. అది కూడా ఒక‌ప‌క్క టీడీపీ అసెంబ్లీ వేదిక‌గా వైసీపీపై దుమ్మెత్తి పోసేందుకు సిద్ధ‌మైన నేప‌థ్యంలో అదేఅసెంబ్లీ లాబీల్లో జ‌గ‌న్‌ను కొనియాడ‌డం ఆస‌క్తిగా మారింది. ఇంత‌కీ ఆయ‌నెవ‌రో కాదు.. విశాఖ జిల్లా ప‌శ్చిమ నియ‌జ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన గ‌ణ‌బాబు.

 

సీఎం జగన్‌కు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమాచారం పక్కాగా అందుతోందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా లాబీలో ఆయన విలేకరులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ... ‘ఇంటెలిజెన్స్ ద్వారా కాకుండా సొంత మార్గాల్లో సీఎం సమాచా రం తెప్పించుకుంటున్నారు. మొన్న విశాఖలో జరిగిన సమీక్షలో ఈ విషయం స్పష్టమైంది. క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ చెప్పని సమాచారాన్ని కూడా సీఎం జగన్‌ తెప్పించుకున్నారు. నాయకుడికి అలాంటి సమా చారం అవసరం’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించాయి.

 

ఒక‌ప‌క్క 21 అంశాల‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న తొలి రోజే కీల‌క నాయ‌కుడు గ‌ణ‌బాబు ఇలా వ్యాఖ్యానించ‌డంలోని ఆంత‌ర్యం ఏంట‌నే అంశంపై మేధావులు దృష్టి పెట్టారు. మాజీ మంత్రి గంటాశ్రీనివాస‌రావు మ‌నిషిగా గ‌ణ‌బాబు గుర్తింపు పొందారు. గంటా పార్టీ మార‌తారంటూ వ‌చ్చిన వార్త‌ల నేప‌థ్యంలో గ‌ణ‌బాబు పేరు కూడా వినిపించింది. అయితే, పార్టీ మార్పుపై గ‌ణ‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు ఏమీ స్పందించ‌లేదు. అలాగ‌ని టీడీపీ చేప‌ట్టిన అనేక నిర‌స‌న‌లు, ఉద్య‌మాల్లోనూ గ‌ణ‌బాబు పాల్గొన‌లేదు. అన్నింటికీ దూరంగా ఉన్నారు.

 

అంతేకాదు, ఇటీవ‌ల మంగ‌ళగిరిలో పార్టీ జాతీయ కార్యాల‌యం ప్రారంభించిన స‌మ‌యంలోనూ ఆయ‌న రాలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌గ‌న్‌పై అక‌స్మాత్తుగా ఇలా పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించ‌డంతో ఆయ‌న వైసీపీలోకి చేరేందుకు లైన్ క్లియ‌ర్ చేసుకుంటున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: