గత కొంత కాలంగా దేశంలో చొరబాటు దారుల తాకిడి ఎక్కువైన విషయం తెలిసిందే.  ఇదే అదునుగా కొంత మంది ఉగ్ర కార్యాకలాపాలకు భారత దేశాన్ని అడ్డాగా మార్చుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభలో పౌరసత్వ (సవరణ) బిల్లు... చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా పొడిగింపుకి సంబంధించిన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పౌరసత్వ సవరణ బిల్లు ఏంటి అన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.  అయితే భారత దేశంలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న  భారతీయులందరికీ పౌరులుగా పౌరసత్వం ఉంటుంది. కాగా,  కేంద్ర ప్రభుత్వం  పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు, వివక్షలూ తట్టుకోలేక 2014 డిసెంబర్ ఆఖరులోపు దేశంలోకి వలస వచ్చిన... ముస్లింలు కాని వారికి పౌరసత్వం కల్పించేందుకు పౌరసత్వ బిల్లులో సవరణలు చేసింది. పౌరసత్వ (సవరణ) బిల్లును లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం ప్రవేశపెట్టారు.

 

ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల నుంచి మతపీడనకు గురై అక్కడి నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వం లభిస్తుంది. వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సిలు, క్రైస్తవులను అక్రమ వలసదారులుగా పరిగణించరు.చర్చ అనంతరం పౌరసత్వ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ఓటింగ్‌ నిర్వహించారు. సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 293 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌ అనంతరం లోక్‌సభలో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  ఇదిలా ఉంటే ఈ బిల్లును ఈశాన్య రాష్ట్రాల ప్రజలు, సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

 

మతాలకతీతంగా దేశంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపేందుకు 1971 మార్చి 24 న తుది గడువుగా నిర్దేశిస్తూ కేంద్రం, ఈశాన్య రాష్ట్రాల మధ్య 1985 లో కుదిరిన అసోం ఒప్పందం నిబంధనలను తాజా సవరణ బిల్లు నిర్వీర్యం చేయనుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ బిల్లు ప్రవేశపెడితే ఇండియా ఇజ్రాయిల్‌గా మారుతుందని ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ బిల్లుపై విపక్షాల డిమాండ్ మేరకు ఓటింగ్ నిర్వహించారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా  293 ఓట్...వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి.  ఓటింగ్ తర్వాత బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా ప్రవేశపెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: