ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు అసెంబ్లీలో మహిళా భద్రత చట్టం పై స్వల్పకాలిక చర్చ జరిగింది. హోం మంత్రి సుచరిత రెడ్డి మహిళా భద్రత గురించి అసెంబ్లీలో మాట్లాడారు. ఇక సీఎం వైఎస్ జగన్ కొత్తగా మహిళా భద్రత చట్టం తెస్తామని అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షిస్తామని జగన్ పేర్కొన్నారు. 

 

మహిళా భద్రత చట్టం గురించి మాట్లాడుతూ, ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ లో జరిగిన దిశ అత్యాచారం, సజీవ దహన ఘటనపై మాట్లాడుతూ, "ఒక 26 ఏళ్ళ డాక్టర్ ఒక టోల్ ప్లాజా వద్ద స్కూటీ నిలిపి వెళ్తే నిందితులు కావాలని స్కూటీ ని పంక్చర్ చేసి, ఆ డాక్టర్ ను రేప్ చేసి కాల్చేశారు. ఎవరైనా ఈ ఘటనపై ఎలా స్పందిస్తారు, మన రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరిగితే మనం ఎలా స్పందించాలి, టీవిలో వాళ్ళ తల్లితండ్రుల భాద ను చూసి నా మనసు చలించిపోయింది. ఇలాంటి ఘటనకు పాల్పడిన వారిని కాల్చేసిన పర్వాలేదని అనిపించింది."

 

"నాకూ ఇద్దరు పిల్లలు ఉన్నారు వారికే ఇలాంటి ఘటన జరిగితే ఎంత భాద ఉంటుంది నాకు. దిశ ఘటన జరిగిన తరువాత తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరు అద్భుతం ఈ సభ సాక్షిగా తెలంగాణ సీఎం కెసిఆర్ కు హాట్సాఫ్, తెలంగాణ పోలీసులకు సెల్యూట్." అంటూ ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

ఈ ఘటన ఇంకెక్కడా జరగకూడదు ఏ తల్లీ, తండ్రి తన బిడ్డ గురించి బాధ పడకుండా ఉండాలని మహిళలకు భద్రత కల్పించడం కోసం నేను ఇక్కడ మీ ముందు నిల్చున్నా. ఒక ఘటనలో సాక్ష్యాధారాలు మన ఎదురుగా కనపడుతున్నప్పుడు విచారణ పేరుతో కాలయాపన చేయకుండా కేవలం 21 రోజుల్లోనే కేసు దర్యాప్తు, కోర్టు ట్రయిల్ ముగించి దోషులకు కఠిన శిక్ష పడేలా ఒక కొత్త చట్టం తీసుకొస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: