తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టించిన దిశ  హత్యాచార ఘటనతో ప్రజలందరు ఉలిక్కిపడ్డారు. ఎంత కౄరంగా ఒక అమ్మాయిని చంపారో కామాంధులు అంతే కౄరంగా దిక్కులేని చావు చచ్చారు అని జనమంతా అనుకుంటున్నారు. ఇక ఆడపిల్లల తల్లిదండ్రుల వెన్నులో వణుకు పుట్టించిన ఈ ఘటనపై అన్ని వర్గాల వారు గొంతెత్తారు. ఒంటరిగా ఉన్న అమ్మాయిని ట్రాప్ చేసి అత్యంత కిరాతకంగా అఘాయిత్యానికి ఒడిగట్టిన రాక్షసులను ఉరి తీయాలని, ఎన్‌కౌంటర్ చేసి చంపాలని డిమాండ్ చేశారు. అందరూ ఆశించనట్లే జరిగింది. దిశను దారుణంగా చంపిన 10 రోజుల్లోపే ఆ మృగాళ్లు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.  

 

 

ఇకపోతే అత్యాచారం జరిగిన పదిరోజులవరకు లేవని కొన్ని నోర్లు నిందితులు మరణించాక ఇప్పుడు హక్కులంటూ, విచారణ అంటూ మళ్లీ మొదటి కొచ్చారు. ఇకపోతే దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఎన్‌కౌంటర్‌పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదేశించింది. ‌ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో అన్ని సాక్ష్యాధారాలను, ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసుల నుంచి సమాచారాన్ని సిట్ సేకరించి.. ఎన్‌కౌంటర్ విషయమై ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

 

 

ఇక ఇప్పటికే షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ పట్ల మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ నివేదికను న్యాయస్థానానికి అందజేస్తారు. కేసులోని సున్నితత్వం దృష్ట్యా సిట్‌ బృందానికి సహకరించాలని ప్రభుత్వం అన్ని విభాగాలను ఆదేశించింది.

 

 

ఇదిలా ఉండగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్ విచారణను హైకోర్ట్ గురువారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం మహబూబ్ నగర్ ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించి భద్రపరచాలని అధికారులను హైకోర్ట్ ఆదేశించింది. ఈ మృత దేహాలు శుక్రవారం వరకు గాంధీలోనే ఉండాలని తెలిపింది. ఇకపోతే నిందితులు మరణించే దాక ఒక తలనొప్పిలా ఉంటే వీరు మరణించాక మరో తలనొప్పి తయారైనట్లుగా ఉందని పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: