హైదరాబాద్ షాద్నగర్ లో  వైద్యురాలు దిశను నలుగురు నిందితులు పథకం ప్రకారం అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే దిశా  ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అత్యాచారం చేసిన నిందితులకు వెంటనే శిక్ష విధించకుండా ఆలస్యం చేస్తుండటంపై ఒక్కసారిగా దేశం భగ్గుమంది. అయితే దిశా  కేసులోని  అత్యాచార నిందితులకు అతి దారుణంగా శిక్షించాలంటూ దేశ ప్రజానీకం డిమాండ్ చేసింది. మరోసారి ఆడపిల్లలపై చేయి  చేయాలంటేనే భయపడేలా నిందితులకు శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ దేశ ప్రజానీకం మొత్తం నిరసనలు తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేశారు. 

 


 అయితే దిశ కేసులో నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పోలీసుల పై ప్రశంసలు కురిపించారు. హాట్సాఫ్ టూ కేసీఆర్ గారు... తెలంగాణ పోలీసులు అంటూ జగన్ వ్యాఖ్యానించారు. సినిమాల్లో దోషులను చంపితే మాత్రం చప్పట్లు కొడతారు అని కానీ నిజజీవితంలో దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి పని చేస్తే మానవ హక్కుల కమిషన్ అంటూ ఢిల్లీ నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు అని జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 


 ఇంత దారుణమైన పరిస్థితుల్లో అసలు చట్టాలు ఏం చేస్తున్నాయి అంటూ జగన్ అన్నారు. నాలుగు నెలల్లో తీర్పు ఇచ్చి అత్యాచారం చేసిన నిందితులకు శిక్ష వేయాలని నిర్భయ చట్టం చెబుతోంది. కానీ నిర్భయ ఘటన జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కూడా ఇప్పటికీ నిర్భయ దోషులకు శిక్ష పడలేదు. ఇలాంటివి జరుగుతున్నప్పుడే ప్రజలకు చట్టాల పై నమ్మకం పోతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని జగన్మోహన్రెడ్డి అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నిందితులను కాల్చేయాలని ఎవరు అనుకోరు అని... కానీ కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా న్యాయం జరగడం జాప్యం జరుగుతుంది అనిపించినప్పుడు మాత్రం ప్రజల ఆగ్రహం తన్నుకొస్తుంది అంటూ జగన్ జగన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: