నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతూనే ఉన్నాయి . కాగా  అసెంబ్లీ సమావేశం హాట్ హాట్ గా  సాగుతోంది. వైసిపి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ వైసీపీ ప్రభుత్వంకి ప్రశ్నల వర్షం కురుపిస్తుంటే . అటు  వైసీపీ కూడా టిడిపి ప్రశ్నలకు ఘాటుగా సమాధానాలు చెబుతుంది. కాగా  అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో  అటు పవన్ కళ్యాణ్ పై  కూడా పలు సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు. 

 


 ఈ క్రమంలోనే నగిరి ఎమ్మెల్యే రోజా పవన్ కళ్యాణ్ పై పలు కామెంట్స్ చేసింది... ఓ వైపు సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడొద్దు అని స్పీకర్ తమ్మినేని సీతారాం చెబుతున్నప్పటికీ రోజా కామెంట్ చేసింది. ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పరోక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. కొంతమంది నేతలు ముగ్గురు పెళ్ళాలు  సరిపోరని నలుగురు పెళ్ళాలు  కావాలని చూస్తున్నారు అంటూ జగన్ వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం జగన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు దాడుల గురుంచి  మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విధంగా వాక్యలు చేసారు . 

 


 మహిళల భద్రతకు వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ లో వివరించారు. అయితే ఈ మధ్య కాలంలో మహిళలపై జరిగిన దాడులకు  సంబంధించి గత ఐదేళ్లలో 1100 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి పరోక్షంగా మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో కొంతమంది పెద్ద పెద్ద నేతలు  ఒకరు సరిపోరు ఇద్దరు,  ముగ్గురు సరిపోరు  నలుగురు పెళ్ళాలు  కావాలి అంటున్నారు అంటూ జగన్ విమర్శించారు.అయితే  పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి జగన్ విమర్శించడం కొత్తేమీ కాదు గతంలో కూడా చాలాసార్లు పవన్ కళ్యాణ్ పెళ్లి పై విమర్శలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: