ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభం అయ్యాయి. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిమాట్లాడుతూ ఈ దేశంలో స్త్రీ తత్వానికి ప్రత్యేకమైన ఔన్నత్యం ఉన్నదని అన్నారు. స్త్రీ లేకపోతే జననం లేదని స్త్రీ లేకపొతే గమనం లేదని స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదని స్త్రీ లేకపోతే సృష్టే లేదని భాగ్యలక్ష్మి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశ సంఘటన దేశంలోని ప్రతి ఒక్కరినీ కలచివేసిందని చెప్పారు. 
 
అతి కిరాతకంగా, అతి క్రూరంగా నలుగురు యువకులు ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసి మానవత్వం లేకుండా పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన సంఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు మహిళలను అత్యాచారం చేసినంత మాత్రాన ఉరిశిక్ష విధించాలా...? రెండు బెత్తం దెబ్బలు వేస్తే సరిపోతుంది కదా..! అంటారని భాగ్యలక్ష్మి చెప్పారు. 
 
సభ్యసమాజం తలదించుకునే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కలచివేస్తున్నాయని భాగ్యలక్ష్మి చెప్పారు. పవన్ కళ్యాణ్ తన ఇంట్లో ఒక ఆడపిల్ల ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత మీడియా ముందు పిస్టోల్ పట్టుకొని ఏ విధంగా డ్రామాలు చేశారో గతంలో మనందరం చూశామని భాగ్యలక్ష్మి అన్నారు. తన ఇంటి ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఒక న్యాయం మరో ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఒక న్యాయమా అని భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. 
 
గత ఐదు సంవత్సరాల టీడీపీ పాలనలో మహిళలపై ఎన్నో దాడులు జరిగాయని భాగ్యలక్ష్మి చెప్పారు. టీడీపీ పాలనలో భయానక వాతావరణం ఉండేదని చెప్పారు. టీడీపీ హయాంలో ప్రత్యూష అనే సినీ నటి హత్యాయత్నం జరిగిందని ఆ కేసులో టీడీపీ మంత్రులు, మంత్రుల కొడుకుల ప్రమేయం ఉందని భాగ్యలక్ష్మి అన్నారు. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అధిక వడ్డీలకు అప్పులిస్తూ అప్పులు తీర్చినా ఇబ్బందులు పెట్టారని భాగ్యలక్ష్మి చెప్పారు. మద్యపాన నిషేధం వలన క్రైమ్ రేటు తగ్గిందని భాగ్యలక్ష్మి చెప్పారు. సీఎం జగన్ ఉల్లిపై చర్చ జరుపుతామని చెప్పినా తెలుగుదేశం పార్టీ టాపిక్ ను డైవర్ట్ చేయటం బాధాకరం అని భాగ్యలక్ష్మి అన్నారు.. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: