దేశంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్న  విషయం తెలుసిందే.  ఆడది కాలు బయట పెడితే చాలు మళ్ళీ తిరిగి ఇంటికి సురక్షితంగా వస్తుందా అనే  నమ్మకం కూడా లేని పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం సమాజంలో. నిర్భయ ఇలాంటి ఎన్నో కటిన చట్టాలు వచ్చినప్పుడు కూడా ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. రోజురోజుకు ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాల్లాంటి  మగాళ్ల  కామపు కోరలు ఆడపిల్లలు చిక్కుకుంటూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ షాద్నగర్ లో దిశా నిందితులను  ఎన్కౌంటర్ చేసినప్పటికీ కూడా కామాంధుల తీరులో మార్పు రాలేదు. ఇప్పటికీ ఆడపిల్లలపై అత్యాచారం ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. 

 


 కనీస రక్షణ కరువై ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతున్నారు మనదేశంలో ఆడపిల్లలు. అటు బయటకి వెళ్తే ఆకతాయిల నుంచి ఇంట్లో ఉంటే సొంత వాళ్ల నుంచి చదువుకోవడానికి వెళ్తే గురువుల నుంచి ఇలా ప్రతి చోట లైంగిక వేధింపులతో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. దేవుడా మాకు ఇలాంటి జీవితం ఎందుకు ఇచ్చావు అంటూ బాధపడుతూనే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్న తరుణంలో.. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల కేసులను విచారించేందుకు యూపీలో 218 ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 

 

 ఇటీవలే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లాలో ఓ యువతిపై అత్యాచారం చేసి దుండగులు ఆమెను చంపేసారు. కేసు విచారణకు హాజరవుతున్న  బాధితురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. తనను తాను కాపాడుకోవడానికి ఒంటినిండా మంటలతో సుమారు కిలోమీటరు దూరం వరకు ఆ యువతి పరిగెత్తడం అందరినీ కలిచివేసింది. అయితే బాధితురాలిని  ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం  లేకుండా పోయింది...  చికిత్స పొందుతూ మరణించింది.

 


 ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొత్తం యూపీలో  75 జిల్లాలు ఉండగా... ఒక్కో జిల్లాకు 3 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలనీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించినది . అయితే అటు ఉన్నావో బాధితులు  కూడా దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసినట్టుగానే అక్కడ రేప్ చేసిన నిందితులను  కూడా ఎన్కౌంటర్ చేసి చంపాలని  డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: