ఆంధ్ర ప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టిడిపి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్  రోజా మాట్లాడుతూ రోజురోజుకీ పెరిగిపోతున్న అత్యాచార ఘటనల గురించి వ్యాఖ్యానించింది. ఆ తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొత్తగా కనుగొన్న అత్యాచారం చేస్తే -- రెండు బెత్తం దెబ్బలు శిక్ష గురించి కూడా ప్రస్తావించారు. ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి మాట్లాడుతూ... 'జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. చరిత్రలోనే రెండుచోట్ల నిల్చొని ఓడిపోయిన గొప్ప నాయకుడు. ఆయన పార్టీ ఎమ్మెల్యే ఇక్కడున్నాడు అధ్యక్షా.. వాళ్ల ఎమ్మెల్యే ద్వారా చెప్పాలనుకుంటున్నాను అధ్యక్షా.. రేప్ చేసిన వారిని ఉరి తీయడం ఏంటి? రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలు అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు' అని చెప్పారు.


ఆ తర్వాత ఇంకా మాట్లాడుతూ... గతంలో ఏం జరిగిందని... ఆయన రివాల్వర్ పట్టుకొని రోడ్డు మీదకు వచ్చాడో చెప్పాల్సిన అవసరముందని.. తన అక్కని అవమానిస్తే ఆయనకు చంపాలనిపించిందని చెప్పడం.. ప్రజలు కూడా విన్నారని, అతని ఇంట్లో వాళ్లకి అనగానే'... వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం జ్యోకం  రోజాని వద్దు అంటూ 'రోజా గారు, అమ్మ.. వద్దు! సభలో ఉన్న వారి కోసం ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నాం' అని చెప్పారు. దాంతో రోజా... పవన్ కళ్యాణ్ ని విమర్శించడం ముగించింది.

ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన సంఘటనను గురించి రోజా ప్రస్తావించారు. ఆమె మాట్లాడుతూ.. 'ఎమ్మార్వో వనజాక్షిని... ఇసుక మాఫియా చేసే చింతమనేని అడ్డుకుంటే... ఆమెను ఇసుకలో వేసి కొట్టినా.. అరెస్ట్ చేయలేదని' ఆమె టిడిపిని విమర్శించారు.

ఇదే సమావేశంలో... దిశ ఘటనలో నిందితుల ఎన్కౌంటర్ ను సమర్ధించాడు జగన్. 21 రోజుల్లో అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష పడేలా ఒక కొత్త చట్టాన్ని త్వరలోనే అమలులోకి తెస్తామని సభాముఖంగా చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: