రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కుల‌పై ఇటీవ‌ల కాలంలో పొగ‌డ్త‌లు వ‌చ్చినా.. స‌టైర్లు వ‌చ్చినా.. ఒకే రేంజ్‌లో ఉం టున్నాయి. సోష‌ల్ మీడియా అందుబాటులో లేని రోజుల్లో ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డిం చేందుకు స‌రైన వేదిక‌లు ఉండేవి కాదు. దీంతో నాయ‌కుల గురించి వారి వ్య‌వ‌హారాల గురించి ప్ర‌జ‌లు ఏమ‌నుకుం టున్నార‌నే విష‌యాలు పెద్ద‌గా తెర‌మీదికి వ‌చ్చేవి కావు. కానీ, ఇప్పుడు సాధార‌ణ మీడియాతో పాటు.. సోష‌ల్ మీడియా ఊపు పెరిగిన నేప‌థ్యంలో నాయ‌కుల‌పై ప్ర‌జాభిప్రాయాలు ఇట్టే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అది కూడా  స‌మ‌యానికి అనుకూలంగా ప్ర‌జ‌లు వెంట‌నే స్పందించేస్తున్నారు.

 

తాజాగా జ‌న‌సేనాని ప‌వ‌న్ చేసిన ట్వీట్‌పై సాధార‌ణ ప్ర‌జ‌లు స‌టైర్ల‌తో కుమ్మేస్తున్నారు. చంద్ర‌బాబుపై ఎం త ప్రేమ ఉన్నా.. వాస్త‌వాన్ని గుర్తించు ప‌వ‌నూ? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అదేస‌మ‌యంలో గ‌డిచిన ఐదేళ్ల‌లో క‌మ్యూనిస్టుల‌తో చేసిన స్నేహంలో ఏం నేర్చుకున్నావు? ప‌్ర‌జ‌లు ఉద్య‌మాలు.. హ‌క్కులు.. ఆప‌ద‌లు అం టూ.. ప్ర‌తి సారి ఉద్య‌మించే వారే.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న స‌మ‌స్య‌ల వాస్త‌వ ప‌రిస్థితు ల‌ను తెలుసుకుని క‌దా అడుగులు ముందుకు వేస్తున్నారు. మ‌రి అలాంటి ది వారి పాటి కూడా నువ్వు చేయ‌క‌పోతే.. ఎలా? అని సోష‌ల్ మీడియా వేదిగా చెరిగేస్తున్నారు.

 

మ‌రి ఇంత‌లా ప్ర‌జ‌ల స‌టైర్ల‌కు ప‌వ‌న్ ఎందుకు గురి కావాల్సి వ‌చ్చింది? అనేది కీల‌క అంశం. ఈ విష‌యం లోకి వెళ్తే.. ఆయ‌న తాజాగా రాష్ట్రంలో ఉల్లిపాయ‌ల కొర‌త‌, ధ‌ర‌ల‌పై స్పందించారు. స‌రే! రాజ‌కీయాల్లో ఉన్నారు కాబ‌ట్టిస‌మయానికి అనుకూలంగా స్పందించారు అనుకుందాం. అయితే, ఇక్క‌డే  ప‌వ‌న్ ప‌ప్పులో కాలేశారు. ఉల్లిపాయ‌ల‌కు జ‌గ‌నే ధ‌ర నిర్ణ‌యించి అమాంతం పెంచేశార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అంతేకాదు. ``త‌ల్లి చేయ‌ని మేలు ఉల్లి కూడా చేయ‌ద‌ని అంటారు. ఇప్పుడు జ‌గ‌న్ తాను చేయ‌ని మేలు ఉల్లి కూడా చేయ‌ద‌ని చెప్ప‌డానికే ఉల్లి ధ‌ర‌లు అమాంతం పెంచారు`` అని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

 

దీంతో సోష‌ల్‌మీడియాలో ప్ర‌జ‌లు పార్టీల‌కు అతీతంగా స్పందిస్తున్నారు. ప‌చ్చ‌క‌ళ్ల‌తో కాదు ప‌వ‌న్ .. నీ సొంత క‌ళ్ల‌తో వాస్త‌వ ప‌రిస్థితిని చూడు. దేశంలో ఎక్క‌డా కూడాఉల్లిపాయ‌ల ధ‌ర‌లు త‌గ్గ‌లేదు. పైగా కొన్నిచోట్ల రూ.200 కు కూడా చేరిపోయింది. అయినా కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం రూ.25 కే విక్ర‌యిస్తోంది. నిజాన్ని నిజంగా ఒప్పుకో! ఇప్పుడేమీ ఎన్నిక‌లు లేవుగా!! అంటూ స‌టైర్ల‌తో కుమ్మేస్తున్నారు. సో.. ఇదీ సంగ‌తి!!

మరింత సమాచారం తెలుసుకోండి: