శీతాకాల సమావేశాల మొదట రోజు తొలిరోజే అసెంబ్లీ లో  వాడీవేడిగా చర్చలు జరిగాయి . సభ మొదలు . అవగానే  అధికార-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది.  విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలఫై గోపాల్‌రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని టీడీపీ ప్రశ్నించింది.

 

ఈ ప్రభుత్వ విధానాల వల్ల పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు..15 రోజుల్లో 41 పీపీఏలు చేసుకున్నారని ఆరోపించారు. వాడినా వాడకున్న పీపీఏల కింద డబ్బులు కట్టాల్సిందేనని.. తమ ప్రభుత్వం వచ్చాక గత నెల డిస్కంలకు రూ.4,900 కోట్లు ఇచ్చామన్నారు బుగ్గన. గత ప్రభుత్వం డిస్కంలను ముంచేసిందని.. వాస్తవాలను టీడీపీ నేతలు జీర్ణించుకోవడం లేదన్నారు. గత పదేళ్లలో రూ.20వేల కోట్ల నష్టాల్లోకి తెచ్చారని.. డిస్కంలు మొత్తం కుప్పకూలే స్థితికి తీసుకొచ్చారని మాట్లాడారు 

 

మంత్రి బుగ్గన సమాధానం ఇచ్చిన తర్వాత. ప్రతిపక్ష నేత చంద్రబాబు  కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ నేతలు పట్టు పట్టారు . ప్రశ్నోత్తరాల సమయంలో ఇలా సభజరగకుండా గందరగోళం సృష్టించడం సరికాదని..  అందరికి మాట్లాడటానికి అవకాశం ఇస్తామని స్పీకర్ తమ్మినేని వారించినా ప్రతిపక్ష సభ్యులు పట్టు వీడలేదు . ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కలగజేసుకొని ప్రశ్నోత్తరాల సమయంలో ఇలా సభను అడ్డుుకొని, నిరసన అనడం సరి అయినా పద్దతి కాదు అని  సభా సంప్రదాయాలను పాటించాలన్నారు.

 

ఈ క్రమంలో అరాచక శక్తులంటూ ప్రతిపక్షం చేసిన మాట్లాడిన మాటలపై  ఆనం అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు తమను అరాచక శక్తులు అంటారా అని కోప్పడ్డారు . తన సీటు వద్దకు వచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించారని.. తన సీటు మార్చాలని ఆనం స్పీకర్‌ను కోరారు. ప్రతిపక్ష నాయకులు తమ వద్దకు వచ్చి మాట్లాడుతుంటే.. నేనేం మాట్లాడుతానని ఆనం ఆరోపించారు. తర్వాత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా ఈ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు క్షమాపణ చెప్పాలని కోరారు. దీంతో స్పీకర్ అరాచక శక్తులు అన్న పదాన్ని అసెంబ్లీ రికార్డుల నుంచి తొలిగిస్తున్నట్లు తెలిపారు 

మరింత సమాచారం తెలుసుకోండి: