హైదరాబాద్ షాద్నగర్ వైద్యురాలు దిశా ని  అతి దారుణంగా నలుగురు కామాంధులు అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై  దేశం ఒక్కసారిగా భగ్గుమంది. కేసులో నిందితులను వెంటనే ఉరి శిక్ష విధించి చంపేయాలి అంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అటు తెలంగాణ ప్రభుత్వం పై కూడా దిశా  రేప్ కేస్ ఘటనపై రోజురోజుకు ఒత్తిడి పెరిగి పోయింది. మరోసారి  ఆడపిల్లలపై చేయి వేయాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చేలా దిశా  నిందితులను శిక్షించాలని దేశ ప్రజానీకం మొత్తం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు గత శుక్రవారం దిశ కేసులోని నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేశారు. కేసు రీ  కన్స్ట్రక్షన్ చేసిన సమయంలో నిందితులు  పారిపోయేందుకు ప్రయత్నిస్తే ఎన్కౌంటర్ చేయక తప్పలేదని దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు. 

 


 అయితే దిశా హత్య కేసులో  నిందితులను ఎన్కౌంటర్ చేసిన తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్ సహా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఘటనపై విచారణ చేపట్టింది. కాగా  జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో నలుగురు నిందితులు బాడీలకు పోస్టుమార్టం జరిగింది. ఈ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై దేశవ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే దిశా  నిందితుల ఎన్కౌంటర్పై హైకోర్టులో దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది. దీంతో  మృతదేహాలను శుక్రవారం వరకు గాంధీ హాస్పిటల్ లోనే భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. 

 

 అయితే ఈ కేసులో చనిపోయిన నిందితుల కుటుంబాలు మాత్రం కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కనీసం తమ వారి మృతదేహాలను కూడా చూపించడం లేదని... కడ చూపు కైనా నోచుకోనివ్వండి అంటూ అధికారులు మీడియాను వేడుకుంటున్నారు నిందితుల కుటుంబీకులు. ఎన్కౌంటర్ జరిగిన రోజు నుండి ఇప్పటి వరకు కనీసం తమవారిని చూడనివ్వలేదని ఇప్పుడు పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత కూడా కనీసం బాడీలను కూడా అప్పగించకపోతే ఎలా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు తండ్రి మాట్లాడుతూ తమకు అండగా ఎవరూ లేరు రారనే  కారణంగానే అధికారులు పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: