హైదరాబాదునగరంలో ఇటీవల ఘోరాతి ఘోరంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వాహనదారులను, ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. మరియు ముసలి వారు , ఒక వయసు వచ్చిన వారు అయితే రోడ్డుపైకి రావాలంటనే జంకుతున్నారు. కొంతమంది ఇష్టానుసారంగా ఏమవుతుందిలే అని మొండి ధైర్యంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేస్తున్నారు.

 

ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారిని చూసి కూడా కేసు తనమీదికి వస్తుందో ఏమో అనేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నారు. మానవత్వం లేకుండా గాయపడిన వారిని పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు.ఈ ప్రమాదాల్లో చాలామంది మరణించడంతో పాటు, ప్రతి రోజు ఏదో ఒక ఒక ప్రాంతంలో వందలమంది క్షతగాత్రులవుతున్నారు. ప్రమాదం చేసిన గుర్తుతెలియని వాహనాల కేసులను పట్టుకొని వారిని శిక్షించుటకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు సైబరాబాద్‌ పోలీసులు. అందుకు ప్రత్యేకంగా ఆర్‌టీఏఎం (రోడ్డు ట్రాన్స్‌పోర్టు యాక్సిడెంట్స్‌ మానిటరింగ్‌ సెల్‌) సెల్‌ ఏర్పాటుచేసిన విషయము అందరికీ తెలిసినదే.

 


హైదరాబాదు కమిషనరేట్‌ పరిధిలో పది నెలల్లో దాదాపు378 రోడ్డుప్రమాదాలు జరిగాయి. డీసీపీ పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రత్యేక ఆర్టీఏఎం గ్రూప్ 63 హిట్‌ అండ్‌ రన్‌ యాక్సిడెంట్‌ కేసులను ఇప్పటివరకు పరిష్కరించిన ది. ప్రమాదాలకు కారణమైన నిందితులను లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు అప్పగించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు న్యాయం చెయ్యడానికి  సైబరాబాద్‌ పోలీసులు తీవ్ర గాలింపుచేస్తున్నారు. హిట్‌ అండ్‌ రన్‌ ప్రమాదాలు జరిగినప్పుడు ఘటనా స్థలానికి వెళ్తున్న బృందం ముందుగా అక్కడి సీసీటీవీ ఫుటేజీలను, పరిశీలించి అక్కడి ప్రజల నుంచి ప్రాథమిక సమాచారం సేకరిస్తోంది.

 

ఆ తర్వాత అదే మార్గంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ సీసీటీవీ కెమెరాలను ఫుటేజీలను సేకరించినట్లు సమాచారము. ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ తెలుసుకునేందుకు త్రీవ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు ఐటీ సెల్‌ సహకారం కూడా తీసుకొంటున్నారు. వాహనం చిరునామా ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేసి చివరకు నిందితులను పోలీసులకు అప్పగిస్తున్నారు.
సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రుల మొత్తము వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

 


మొత్తం కేసులు 378
మృతులు 131
క్షతగాత్రులు 324
ఆర్టీఏఎం సెల్‌ ఛేదించినవి 63
పోలీసులు ఛేదించినవి 126
పెండింగ్‌ కేసులు 189.
హిట్‌ అండ్‌ రన్‌ ప్రమాదాలకు కారణమవుతున్న నిందితులు ఇక ఏ మాత్రము తప్పించుకోలేరు. ప్రమాదం జరిగినప్పుడు మనల్నిఎవరూ చూడలేదు కాబట్టి మనము తప్పించుకున్నామూలే అని అనుకోవడం చాలా పొరపాటు. దొరకములే అని అనుకోవడం మన తెలివి తక్కువ తనం. ఆర్టీఏఎం సెల్‌ నిందితుల గుట్టు రట్టు చేస్తోంది. కాబట్టి ప్రమాదము జరిగిన వెంటనే మనమే పోలీసులకు విషయము తెలియజేయడం మన కర్తవ్యము, బాధ్యత.

మరింత సమాచారం తెలుసుకోండి: