తెలంగాణ నూతన గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ఈరోజు యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని కుటుంబసమేతంగా వెళ్లి దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొనింది. ఆలయ అర్చకులు గవర్నర్ తమిళ్ సై పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. కాగా గవర్నర్ తో పాటు మంత్రి జగదీష్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రామన్నపేట ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య తదితరులు ఉన్నారు.

 

అయితే ఇలా యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంకు వెళ్లే ముందు గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్‌ కు ఓ అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఆ దృశ్యం ఆమె మనసును ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంత ఆకట్టుకునే దృశ్యం ఏంటి అబ్బా అని అనుకుంటున్నారా ? అదేనండి ప్రేమ చిలుకలు రాజ్ భావన్ కు వచ్చి సందడి చేశాయి. ఆ సందడి చూసి ఆమె మనసు ఎంతగానో పరవశించింది. 

 

ఆ దృశ్యం ఏంటంటే.. రెండు ప్రేమ పక్షులు వాటి భాషలో అవి అరుచుకుంటూ ఉన్నాయి.. దీంతో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ రాజ్‌భవన్‌లో రెండు ప్రేమ పక్షులను చూసి ముచ్చట పడ్డారు. రాజ్‌భవన్‌లో ఉన్న ఓ చెట్టు కొమ్మపై ఆ రెండు చిలుకలు తమ భాషలో ముచ్చటగా, ప్రేమతో మాట్లాడుకుంటున్న దృశ్యాలను గవర్నర్‌ తమిళిసై తన ఐప్యాడ్‌ కెమెరాతో ఫోటోలు తీశారు. మరో చెట్టుపై చిలుకల సముహం ఉన్న దృశ్యాలను గవర్నర్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ పక్షుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: