ఏపీలో రాజకీయ పార్టీలు ఏదో కులానికి బ్రాండ్ అబాసిడర్లుగా ఉంటాయనే విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ కమ్మ సామాజికవర్గం మద్ధతు ఉంటే, వైసీపీకి రెడ్ల సపోర్ట్ ఉంది. అయితే మొన్నటివరకు అధికారంలో ఉన్న టీడీపీ....వైసీపీలో ఉన్న బలమైన రెడ్డి నేతలనీ తమ వైపు లాగేసుకుని, వైసీపీని వీక్ చేయాలని ప్రయత్నించింది. నేతలని అయితే పార్టీలోకి తీసుకున్నారు గానీ, వైసీపీని వీక్ చేయడం కుదరలేదు. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ....టీడీపీలో పటిష్టంగా ఉన్న కమ్మ నేతలని లాగేసుకోవడమే లక్ష్యంగా పని చేస్తుంది.

 

అధినేత జగన్ ఇప్పటికే ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవల వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ లాంటి వారిని పార్టీల జాయిన్ చేసుకున్నారు. అయితే జగన్ ఫోకస్ ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని కమ్మ ఎమ్మెల్యేల పై పెట్టారు. వారిని పార్టీలోకి తీసుకురావడమే టార్గెట్ గా పెట్టుకుని ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు. తమ మంత్రులతో ఆల్రెడీ లాబీయింగ్ లో బిజీగా ఉన్నారు. కాకపోతే ఈ లాబీయింగ్ కు లొంగి ఎవరు వైసీపీలో చేరతారనే విషయం పక్కనబెడితే....జగన్ ప్రత్యేకంగా వారిపైనే ఫోకస్ పెట్టడానికి కారణాలు లేకపోలేదు.

 

ప్రకాశం జిల్లాలో ఉన్న ముగ్గురు కమ్మ ఎమ్మెల్యేలు బాగా బలంగా ఉన్నారు. చీరాలలో ఉన్న కరణం బలరాంకు జిల్లా మొత్తం మీద పట్టుంది. అందుకే కరణం బలరాంని జగన్ పార్టీలోకి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అటు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు మంచి ఫాలోయింగ్ ఉంది. గత ఐదేళ్లు నియోజకవర్గంలో మంచి అభివృద్ధి చేయడం వల్లే...ఇంతటి జగన్ గాలిలో కూడా దగ్గుబాటి లాంటి నేతని ఓడించి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఇలాంటి నేత పార్టీలో ఉంటే నియోజకవర్గంలో తిరుగుండదని జగన్ భావిస్తున్నారు. అందుకే ఏలూరిపై ఎక్కువ ఫోకస్ చేశారు.

 

ఇక అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్....2014లో వైసీపీ నుంచే గెలిచే టీడీపీలోకి వచ్చారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉండటంతోనే పార్టీ మారిన మళ్ళీ విజయం సాధించగలిగారు. ఆశ్చర్యంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన 23 మంది ఎమ్మెల్యేల్లో గొట్టిపాటి ఒక్కరే గెలిచారంటేనే అర్ధం చేసుకోవచ్చు ఆయన సత్తా ఏంటో. అందుకే జగన్ కూడా మళ్ళీ గొట్టిపాటిని తన దగ్గరకు రప్పించుకోవాలని చూస్తున్నారు. ఇలా ఈ ముగ్గురు బలంగా ఉండటం, కమ్మ సామాజికవర్గంలో పట్టు ఉండటంతో జగన్ వారిపై ఎక్కువ ఫోకస్ పెట్టార‌ని టాక్‌..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: