35ఏళ్లకే ప్రధానిగా చరిత్ర సృష్టించిందో మహిళ. ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలైన మహిళగా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ఫిన్ లాండ్ తో పాటు, ఉక్రెయిన్, న్యూజిలాండ్ దేశాలకు కూడా తక్కువ వయస్సున్న మహిళలే ప్రధానులుగా ఉన్నారు. 


ఫిన్ లాండ్ ప్రధానిగా సనా మారిన్ రికార్డు క్రియేట్ చేయనున్నారు. 34 ఏళ్లకే ఆమె ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన అతిపిన్న వయసున్న మహిళగా మారిన్ ఘనత సాధించనున్నారు. మహిళల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ఆమె సారథ్యం వహించనున్నారు.

 

మాజీ ప్రధాని అంటి రిన్నే ... దేశంలో పోస్టల్ సమ్మెను నియంత్రించలేకపోయారు. దీంతో ఆమె తన పదవి నుంచి తప్పుకుంటూ రాజీనామా చేశారు. మారిన్ త్వరలో ప్రధాని బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫిన్ లాండ్ లో రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ సనా మారిన్ బాధ్యతలు చేపడుతున్నారు. గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన సనాను సోషల్ డెమొక్రాట్ పార్టీ సభ్యులు ప్రధానిగా ఎన్నుకున్నారు. దీంతో,  ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్సులో అత్యున్నత పదవి అలంకరించిన మహిళగా సనా చరిత్రకెక్కుతున్నారు. 

 

తానెప్పుడూ వయస్సు గురించి గానీ, మహిళను అనే విషయం గురించి గానీ ఆలోచించలేదనీ, ప్రజల నమ్మకాన్ని చూరగొని వారికి సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానంటున్నారు సనా మారిన్. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమర్థవంతంగా పూర్తి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. 

 

సనా కంటే ముందు ఉక్రెయిన్ ప్రధాని ఓలెక్సీ హాంచరుక్ 35ఏళ్ల వయస్సులో ప్రధానిగా చరిత్ర సృష్టిస్తే, న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ వయసు 39 ఏళ్లు. మరోపక్క ఫిన్లాండ్ లోని సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలన్నీ మహిళల నేతృత్వంలోనివే కావటం మరో విశేషం.

 

ఫిన్‌ లాండ్ అనేది ప్రపంచపటంలో ఓ చిన్న దేశం. కానీ, విద్యా రంగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గుర్తింపు సాధించింది. ఈ దేశంలో నూరుశాతం అక్షరాస్యతే కాదు.. పిల్లల చదువులో, శారీరక, మానసిక ఆరోగ్యంలో కూడా ముందంజలో ఉన్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: