రాజకీయాల్లో యువత ఎప్పుడు ముఖ్యపాత్ర పోషిస్తుంటారు. ఎన్నికల్లో ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి రావాలన్న, మరో పార్టీ చిత్తుగా ఓడిపోవాలన్న యువకుల చేతులోనే ఉంటుంది. 2019 ఏపీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా అర్ధమైంది. వైసీపీ భారీ విజయం సాధించడంలో వీరేది కీ రోల్. అటు టీడీపీ చిత్తుగా ఓడిపోవడానికి కూడా కారణం వీరే. గత ఐదేళ్లు యువతకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల...ఎక్కువ మంది జగన్ వైపు వచ్చేశారు. ఈ ఎన్నికల్లో కొత్తగా ఓటు వచ్చిన యువత సైతం జగన్ కే జై కొట్టారు.

 

అయితే ఎన్నికల్లో కొంత యువత మద్ధతు జనసేనకి దక్కింది. పవన్ కల్యాణ్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఇవ్వడంతో ఆయన వైపు కొంతమంది వెళ్లారు. ఇక టీడీపీ యువతని ఆకట్టుకునే నాయకుడే లేకపోవడంతో తక్కువ స్థాయిలో యూత్ చంద్రబాబు వైపు వెళ్లారు. ఇక ఎక్కువ స్థాయిలో యువత తనకు మద్ధతు ఇవ్వడంతో...జగన్ అధికారంలోకి రావడమే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయం పేరిట లక్షల్లో ఉద్యోగాలు కల్పించారు. కేవలం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఈ కార్యక్రమాలు చేయడంతో యువత జగన్ పట్ల మరింత పాజిటివ్ గా మారారు.

 

అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే...ఎన్నికల్లో టీడీపీ, జనసేనలకు మద్ధతు తెలిపిన యువతకు కూడా ఉద్యోగాలు రావడంతో వారు జగన్ వైపు తిరిగారు. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం చేయలేనిది జగన్ ప్రభుత్వం చేసేసరికి వారు జగన్ కు జై కొడుతున్నారు. తమకు ఉద్యోగాలు కల్పించినందుకు కృతజ్ఞతగా ఎప్పటికీ జగన్ కు అండగా ఉంటామని చెబుతున్నారు. అటు మహిళల భద్రత కోసం కొత్త చట్టం తీసుకురానుండటంతో వారు కూడా ఎక్కువ జగన్ వైపు నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.

 

ఇక రాబోయే ఎన్నికల్లో తమ మద్ధతు జగన్ కే ఉంటుందని ఇప్పటి నుంచే చెప్పేస్తున్నారు. ఇక త్వరలో రాబోయే స్థానిక సంస్థలు, పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి అండగా ఉంటామంటున్నారు. మొత్తానికి బాబుకు తెలుగు యువత హ్యాండ్ ఇచ్చి జగన్ కు జై కొడుతున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: