ఏపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ పార్టీ రోజుల పార్టీలోకి ఎవరిని ఆహ్వానించలేదు .కానీ  ప్రస్తుతం అందరినీ పార్టీలోకి రావాలంటూ ఆకర్షిస్తోంది వైసీపీ పార్టీ . ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలను కూడా తమ పార్టీలో చేర్చుకుంది. వైసీపీలో కీలక నేతగా ఉన్న దేవినేని అవినాష్ వైసీపీ పార్టీలో చేర్చుకుని కీలక బాధ్యతలు అప్పగించారు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. అటు ఇంకొంతమంది టీడీపీ నేతలు పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వైసీపీ నేతల కామెంట్స్ చేసిన విషయం కూడా తెలిసిందే. 

 

 

 

 తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీలోనే మొదలుపెట్టి కీలక నేతగా ఎదిగిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం టిడిపి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత  వైసీపీలో చేరుతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు వల్లభనేని వంశీ మాత్రం  వైసీపీ తీర్థం పుచ్చుకోలేదు . కానీ ఎట్టి పరిస్థితుల్లో వల్లభనేని వంశీ వైసీపీలోకి వస్తారన్నది మాత్రం ఆంధ్ర  రాజకీయాల్లో  అందరు అనుకుంటున్న మాట. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు రంగరాజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గోకరాజు రంగరాజు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు.

 

 

 

 అయితే గోకరాజు రంగరాజు మాత్రమే కాకుండా రంగరాజు సోదరులు రామరాజు,  నరసింహరాజు కూడా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక  గోకరాజు కుటుంబ సభ్యులందరినీ వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు వైసీపీ అధినేత జగన్ . ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల నుండి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సైతం వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన గోకరాజు గంగరాజు వైసీపీలో చేరుతుంది తాను కాదని తన కుమారుడు రంగరాజు, అతని  సోదరులు మాత్రమేనంటూ  వెల్లడించారు. ఎలాంటి వివరణ తీసుకోకుండా పార్టీ మారుతున్ననంటూ ఏకపక్షంగా ప్రచారం చేయడం సరికాదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: