అసెంబ్లీ శీతాకాల సమావేశాల  మొదటి రోజే సభలో వైసిపి ఎంఎల్ఏ రోజా ముగ్గురిని ఉతికి ఆరేసింది. మహిళలపై అత్యాచార నియంత్రణపై చర్చ జరగాలని అధికార పార్టీ ప్రతిపాదించింది. కొత్త చట్టాలు చేయటం ద్వారా అత్యాచారాలు, హత్యాచారాలను నియంత్రించాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. అందుకు ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ఉద్దేశ్యంతో అసెంబ్లీలో ముందు చర్చ జరుపుదామని అనుకున్నారు.

 

అయితే విచిత్రంగా చంద్రబాబునాయుడు అండ్ కో మాత్రం పెరిగిపోతున్న ఉల్లిపాయల ధరల మీద చర్చ జరగాలని గోల మొదలుపెట్టారు. ఉల్లిపాయల ధరల మీద కూడా చర్చిద్దామని ముందుగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్చ జరగాలని జగన్ తో పాటు స్పీకర్ మంత్రులు చెప్పినా చంద్రబాబు వినలేదు.

 

సరే టిడిపి ఎంత అభ్యంతరం పెట్టినా అధికార పార్టీ మాటే నెగ్గుతుంది కాబట్టి మొత్తానికి మహిళల భద్రతపై చర్చ మొదలైంది. ఇందులో భాగంగానే స్పీకర్ ముందుగా మహిళా సభ్యురాళ్ళనే మాట్లాడించారు. ఇందులో భాగంగానే రోజా మాట్లాడుతూ చంద్రబాబు, పుత్రరత్నం లోకేష్, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణలను ఉతికి ఆరేసింది.

 

ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ’ఆడవాళ్ళని కమిట్ చేయించాలంటే ముద్దయినా పెట్టాలి లేదా కడుపయినా చేయాల’ని బాలకృష్ణ  చేసిన వ్యాఖ్యలను రోజా గుర్తుచేశారు. చంద్రబాబు గురించి మాట్లాడుతూ కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి, రిషితేశ్వరి హత్యాచారం, నారాయణ విద్యాసంస్ధల్లో జరిగిన ఘోరాల గురించి మాట్లాడుతారన్న భయంతోనే చంద్రబాబు చర్చకు అడ్డుపడుతున్నారంటూ మండిపోయారు.

 

లోకేష్ గురించి మాట్లాడుతూ అమ్మాయిలతో మందు తాగుతూ, కౌగలించుకున్న ఫొటోల గురించి మాట్లాడుతారన్న భయంతోనే చంద్రబాబు చర్చ జరగకుండా అడ్డుకుంటున్నట్లు చెప్పారు. ఎంఆర్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టిన ఎంఎల్ఏనే వెనకేసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఆడవాళ్ళంటే ఏమాత్రం గౌరవం లేని చంద్రబాబు మహిళల భద్రతపై జరిగే చర్చకు సహకరిస్తారని అనుకోవటం భ్రమగా తేల్చేశారు. పనిలో పనిగా పవన్ కల్యాణ్ గురించి కూడా బాగానే చురకలేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: