వైఎస్సార్ సీపీ 13 జిల్లాలో బాగా బలంగా ఉన్న అధినేత జగన్ వలసలని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఈ వలసల వల్ల పార్టీకి నష్టం లేదా? అంటే  లేదనే చెప్పొచ్చు. ఇప్పుడు జగన్ నేతృత్వంలోని వైసీపీకి 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్నారు. నియోజకవర్గాల వారీగా నేతలు ఫుల్ గా ఉన్నారు. అయినా సరే టీడీపీ, జనసేనల నుండి వచ్చే నేతలనీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీని వల్ల పార్టీ మరింత బలపడుతుందే తప్ప, నష్టమేమీ జరుగుతున్నట్లు కనిపించడం లేదు.

 

అసలు ఈరోజుల్లో పార్టీలు మారిన నేతలని ప్రజలు అంగీకరించడం లేదు. వారిని ఎన్నికల్లో గట్టిగా తిరస్కరిస్తున్నారు. దీనికి ఉదాహరణ టీడీపీ పార్టీనే నిలుస్తుంది. మొన్నటివరకు అధికారంలో ఉన్న టీడీపీ ఇష్టారాజ్యంగా  వైసీపీని వీక్ చేయాలని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలని, ఎంపీలని, నేతలని పార్టీలోకి తీసుకున్నారు. దీని వల్ల వైసీపీ మరింత వీక్ అవుతుందని అనుకున్నారు. కానీ అది జరగలేదు.

 

ఎన్నికల్లో రివర్స్ కొట్టి టీడీపీకే పెద్ద నష్టం జరిగింది. పార్టీ మారిన వారు ఎవరు గెలుపు గుర్రం ఎక్కలేదు. ప్రజలు వారిని తిరస్కరించారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ కూడా వలసలని ప్రోత్సహిస్తున్నారు. కానీ అది గుడ్డిగా చేయడం లేదు. చంద్రబాబు లాగా ఎడాపెడా నేతలని తీసుకోకుండా బాగా ఫాలోయింగ్ నేతలనే పార్టీలోకి తీసుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేల విషయంలో కూడా జగన్ నిజాయితీగా వ్యవహరిస్తున్నారు. పార్టీలోకి వచ్చే ఏ ఎమ్మెల్యే అయిన తమ పదవికి రాజీనామా చేసే రావాలని కండిషన్ పెట్టారు.

 

దీంతో ఇప్పుడు వైసీపీలోకి వచ్చే ఏ ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా రాజీనామా చేసి రావాల్సిందే. దీని వల్ల జగన్ తన నిబద్ధతతో ప్రజలు మెప్పు పొందుతున్నారు. పదవి లేని వారిని తీసుకున్న రాజకీయ పార్టీ అన్నాక ఇవి కామనే అనుకుంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల విషయంలో జగన్ కండిషన్ పెట్టడం వల్ల...వైసీపీలోకి నేతలు వలస వస్తున్న నెగిటివ్ రావడం లేదు. కాబట్టి ఈ వలసల వల్ల వైసీపీకి ఏ మాత్రం నష్టం జరగదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: