ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని ఎలా ఇబ్బంది పెట్టాలా ? అని చంద్రబాబునాయుడు ఆలోచిస్తుంటే మరోవైపు జగన్ బ్రహ్మాండమంటూ టిడిపి ఎంఎల్ఏ గణబాబు ఆకాశానికెత్తేశారు.  అసెంబ్లీ శీతాకాల సమావేశాల మొదటిరోజైన సోమవారం లాబీల్లో మీడియాతో గణబాబు  మాట్లాడుతూ జగన్ నెట్ వర్క్ బ్రహ్మాండంగా పనిచేస్తోందంటూ ప్రశంసించటం పార్టీలో సంచలనంగా మారింది.

 

సభలో అయినదానికి కానిదానికి జగన్ పై ఎలా బురద చల్లాలా అని చంద్రబాబు తెగ తాపత్రయపడిపోతున్నారు. చంద్రబాబు అవస్తలతో తనకేం పని అనుకున్నారో ఏమో గణబాబు. అసెంబ్లీ లాబీల్లో ఎదురుపడిన మీడియాతో మాట్లాడుతూ సమాచారం తెప్పించుకోవటంలో జగన్ ఇంటెలిజెన్స్ బ్రహ్మాండంగా పని  చేస్తోందన్నారు.

 

సమాచారం తెప్పించుకోవటంలో కానీ సేకరించటంలో కానీ ప్రతిదానికి ఇంటెలిజెన్స్ మీదే ఆధారపడటం లేదన్న విషయం తెలిసిందన్నారు. విశాఖపట్నంలో ఈమధ్యే జరిగిన ఓ ఘటనలో ఇంటెలిజెన్స్ ఓ నివేదికను సిఎంకు అందించిందన్నారు. అయితే నివేదికలోని అంశాలను తన దగ్గరున్న సమాచారంతో చూసుకుని ఉన్నతాధికారులను నిలదీసినట్లు తనకు తెలిసిందన్నారు.

 

మొత్తానికి ఇంటెలిజెన్స్ ఇచ్చిన వివరాలు పూర్తిగా వాస్తవం కాదని అందుకనే తనదైన మార్గాల్లో పూర్తి సమాచారాన్ని జగన్ తెప్పించుకున్నట్లు అర్ధమైపోయిందన్నారు. అంటే ఓ సమాచారం తెప్పించుకోవటంలో ఒక్క ఇంటెలిజెన్స్ పైనే ఆధార పడకుండా అనేక మార్గాల్లో సమాచారం తెప్పించుకుంటున్న విషయం స్పష్టమైపోయిందన్నారు.

 

నిజంగా సిఎంకు ఉండాల్సిన ముఖ్య లక్షణమే అదన్నారు. సమాచారం తెప్పించుకోవటంలో ఇంటెలిజెన్స్ మీద మాత్రమే సిఎం ఆధారపడటం లేదని తెలిస్తే ముందు ముందు ఉన్నతాధికారులే అసలైన సమాచారాన్ని సిఎం ముందుకు తెస్తారన్నారు. ఈ విషయంలో నిజంగా జగన్ గ్రేట్ అంటూ ప్రశంసించారు.

 

క్షేత్రస్ధాయిలో సమాచారాన్ని తెప్పించుకోవటంలో సిఎం సక్సెస్ అయితేనే వాస్తవాలు తెలుస్తాయన్నారు. అందరు అన్నీ వివరాలను సిఎంకు చెప్పరని గణబాబు అభిప్రాయపడ్డారు. అంటే మొన్నటి వరకూ చంద్రబాబునాయుడు తో పడిన అవస్తలను బహుశా ఎంఎల్ఏ గుర్తు చేసుకున్నారేమో. ఇక్కడే సమాచారం తెప్పించుకోవటంలో చంద్రబాబుకు జగన్ కు ఉన్న తేడాను గణబాబు ప్రస్తావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: