షాద్నగర్లో వైద్యురాలు దీక్షపై నలుగురు నిందితులు పథకం ప్రకారం అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన  విషయం తెలిసినదే. నిందితులకు  వెంటనే ఉరిశిక్ష విధించాలని అంటూ దేశ ప్రజానీకం డిమాండ్ చేసింది. అయితే నిందితులకు శిక్ష విధించడంలో ఆలస్యం జరుగుతున్న దానిపై అసహనం వ్యక్తం చేసినది  దేశ ప్రజానీకం. నిందితుల్ని మాకు అప్పగించండి మేమే చంపేస్తామంటూ నిరసనలు కూడా తెలిపారు . ఈ నేపథ్యంలో ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. కేసును రికన్స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు  తమపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా ఎన్కౌంటర్ చేయక తప్పలేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఎన్కౌంటర్పై వివరణ కూడా ఇచ్చారు. 

 


 అయితే నలుగురు నిందితుల ఎన్కౌంటర్పై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ఎన్కౌంటర్ చేశారని అభిప్రాయపడుతుంటే ఇంకొంతమంది ఇలాంటి శిక్ష విధిస్తూనే  అత్యాచారాలు తగ్గుతాయి అంటున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో దిశా  నిందితుల ఎన్కౌంటర్పై పిటిషన్ దాఖలయింది. అయితే నేడు ఎన్కౌంటర్పై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అయితే ఈ శుక్రవారం వరకు నిందితుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని ఆదేశించింది. 

 


 ఈ నేపథ్యంలో నలుగురు నిందితుల మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నలుగురు నిందితుల మృతదేహాల తరలింపు సందర్భంగా మహబూబ్నగర్ మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. కొద్ది సేపటికి క్రితమే ఏసీ ఆంబులెన్స్ లు  మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రి వద్దకు చేరుకున్నాయి. అయితే నలుగురు నిందితులను మృతదేహాన్ని భద్రపరిచేందుకు గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఫ్రీజర్  బాక్స్ లను ఏర్పాటు చేశారు. కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా మృతదేహాలను రాత్రి సమయంలో తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అటునిందితుల  కుటుంబీకులు తమవారిని కడసారి చూసుకొనే వీలైన కల్పించాలంటూ పోలీసులను అధికారులను వేడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: