సాధారణంగా ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా ప్రతిపక్షం మాత్రం అధికార పార్టీ మీద తీవ్ర స్థాయిలో మండిపడుతుంటుంది. చిన్న విషయం దొరికినా అధికార పార్టీ మీద రెచ్చిపోయి విమర్శలు చేస్తుంటుంది. అయితే ఏపీలో తాజాగా టీడీపీ ఎమ్మెల్యే జగన్ ను పొగడటం ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీల్లో నేతల వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు ఆ పార్టీలో ఉంటారు? ఎవరు ఆ పార్టీని వీడతారనే చర్చ ఉండనే ఉంది. పది మంది పక్క చూపులు చూస్తున్నారనే టాక్ నడుస్తూ ఉంది.

 

కానీ ఇప్పటికైతే పెద్ద సంఖ్యలో టీడీపీ నుంచి వైసీపీలోకి రాజీనామా చేసి వచ్చిన పరిస్థితి అయితే లేదు. అయితే కొందరు అందుకు ఖండన ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరో ఎమ్మెల్యే అనుమానాలు రేపేలా కామెంట్స్ చేశారని తెలుస్తోంది. ఆయనే విశాఖ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ తరఫున నెగ్గిన 23 మందిలో ఈయనా ఒకరు. విశాఖ నుంచి నెగ్గిన టీడీపీ ఎమ్మెల్యేలంతా పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం ఒకటి ఉంది. అందుకు ఊతం ఇచ్చేలా గణబాబు మాట్లాడుతూ సీఎం జగన్ ను ప్రశసించారు.



సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీ ఎమ్మెల్యే పొగడటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పథకాల అమలు గురించి సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఈయన ప్రశంసించారు. పథకాల అమలు విషయంలో జగన్ పూర్తి సమాచారాలను తెప్పించుకుంటున్నారని ఇందు కోసం ఇంటెలిజెన్స్ మీద కూడా సీఎం ఆధారపడటం లేదని డైరెక్టుగా సమాచారాన్ని తెచ్చుకోవడానికి ఆయన ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారని గణబాబు అన్నారు. ఇలా క్షేత్ర స్థాయి సమాచారం గురించి జగన్ మోహన్ రెడ్డికి పూర్తిగా అవగాహన ఉందన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా సమాచారం. తమ రాజకీయాల గురించి నేతలు లాబీల్లోనే క్లారిటీ ఇస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో ఈ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: