మానవ సంబంధాలకు రోజురోజుకు విలువ తగ్గిపోతుంది. శారీక సుఖం కోసం మనిషి తెగిస్తున్న తీరు చూస్తూంటే తన జీవిత లక్ష్యం ఒంట్లో చెలరేగే మంటలను పడక సుఖంలో పంచుకోవడం అనే ఆలోచనలతో రోజు బ్రతికేస్తున్నాడని పిస్తుంది. ఎక్కడ ఆడది ఒంటరిగా దొరికితే అక్కడ రక్కసిలా మీదపడి రక్కుతున్నారు. వావివరసలు ఏవి చూడటం లేదు. ఇలాగైతే ముందు ముందు రక్తసంబంధాల విషయాల్లో కూడా భయపడవలసి వస్తుంది. ఇప్పుడున్న పరిస్దితుల్లో ఆడవారిని ఒంటరిగా పంపాలంటే భయపడే రోజులు నెలకొన్నాయి.

 

 

ఇకపోతే సొంత అన్నభార్య తనతో అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదన్న కోపంతో హత్యాయత్నం చేసిన ఘటన బిహార్‌లో కటోరియా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు పరిశీలిస్తే బంకా గ్రామానికి చెందిన వ్యక్తి తన కుటుంబ పోషణ కోసం కోల్‌కతాలో పనిచేస్తుండగా అతడి భార్య, తన 14 సంవత్సరాల పిల్లాడితో కలిసి గ్రామంలో ఉన్న ఓ ఇంట్లో ఉంటోంది. వారికి కొద్ది దూరంలో ఉండే ఆమె మరిది అన్న భార్యపై కన్నేసాడు. అంతటితో ఊరుకోకుండా తన కోరిక తీర్చాలని, తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని కొద్ది రోజులుగా ఆమెను వేధించసాగాదు.. తనను ఇలా వేధించడం సరికాదని ఎన్నిసార్లు చెప్పినా ఆ కామాంధుడు వినిపించుకోవడం లేదు.

 

 

ఈ విషయం భర్తకు చెబితే పరిస్దితులు ఎక్కడికి దారి తీస్తాయోనని భయపడిన ఆమె ఈ విషయాన్ని తనలోనే దాచుకుంది. ఇక ఒకరోజు రాత్రి ఆమె ఇంట్లోకి దొంగతనంగా దూరిన త్రిపురారీ లైంగిక కోరిక తీర్చాలంటూ మరోసారి ఆమెను వేధించాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో బాధితురాలు గట్టిగా అతడిని వెనక్కి నెట్టేసింది.

 

 

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన త్రిపురారీ పదునైన కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇకపోతే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: