దిశను అత్యాచారం చేసి చంపాలన్న దురాశ ఆ నలుగురు దుర్మార్గులకు ఏ దుర్ముహూర్తంలో కలిగిందో కానీ.. కుక్కల కంటే హీనమైన చావు వారికి వచ్చింది. దిశను అత్యాచారం చేసి కిరాతకంగా చంపిన వారు.. పోలీసుల చేతుల్లో చావడమే కాకుండా.. శవాలు అంత్యక్రియలకు కూడా సకాలంలో నోచుకోక పోతున్నాయి. వాస్తవానికి ఎన్ కౌంటర్ చేసిన రోజే వారి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసినా అనేక మలుపుల కారణంగా వారి శవాలు ఇంకా మార్చురీల్లోనే మగ్గుతున్నాయి.

 

తాజాగా ఈ విషయంలో మరో మలుపు తిరిగింది. హైకోర్టులో కేసు విచారణ గురువారానికి వాయిదా పడినందువల్ల.. నిందితుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది. శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలోనే నిందితుల మృతదేహాలను భద్రపర్చాలని స్పష్టం చేసింది హైకోర్టు. సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున కేసు వాయిదా వేసిన హైకోర్టు... సీనియర్‌ లాయర్ ప్రకాష్‌రెడ్డిని మధ్యవర్తిగా సూచనలు ఇవ్వాలని సూచించింది.

 

కోరికలతో కాలిపోయే నలుగురు భామలతో ఒక్కడే మగాడు.. ఎలా తట్టుకున్నాడో..?

 

కాబట్టి.. బుధవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన తర్వాతే హైకోర్టు గురువారం విచారణ చేస్తుందన్నమాట. ఈ కారణాలతో ఆ దుర్మార్గుల శవాలు మహబూబ్ నగర్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ గాంధీకి తరలించారు. ఇప్పటికే ఎన్ కౌంటర్ జరిగి నాలుగైదు రోజులు కావడం వల్ల శవాలు కుళ్లిపోకుండా.. గాంధీలో మంచి సౌకర్యాలు ఉంటాయి కాబట్టి అక్కడికి తరలించారు.

 

మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఈ శవాల పోస్టుమార్టం జరిగింది. ఆ తర్వాత మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో మృతదేహాలను భద్రపరిచారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో మహబూబ్‌నగర్ నుంచి గాంధీకి నిందితుల మృతదేహాలు చేరుకున్నాయి. ఇంకెప్పుడు వీటికి విముక్తి లభిస్తుందో..?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: