సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది పెద్ద సంచలనమే. ఏ చిన్న  మాట మాట్లాడినా అది ఒక పెద్ద వివాదంగా మారి పోతుంది  అందుకే వర్మను అందరూ వివాదాల దర్శకుడు అని పిలుస్తుంటారు . ఇక ఆయన తెరకెక్కించే సినిమాలు కూడా కేరాఫ్ వివాదాలు అన్నట్టుగా ఉంటాయి. ప్రతి సినిమాలో ఏదో ఒక వివాదం తెరపైకి తెస్తు  సంచలనం సృష్టిస్తూ ఉంటాడు. ఇప్పటికే ఎన్నో సంచలనాత్మక సినిమాలను తెరకెక్కించాడు రాంగోపాల్ వర్మ. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో పెద్ద సంచలనం సృష్టించాడు. ఇప్పుడు తాజాగా అమ్మ  రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాని తెరకెక్కించి విడుదలకు సిద్ధమవుతున్నాడు . అయితే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే ఈ సినిమా టైటిల్ ఉండటంతో మొదట ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించలేదు, 

 

 

 

 ఆ తర్వాత వర్మ ఒక మెట్టు దిగి వచ్చి టైటిల్ మార్పు చేస్తూ అమ్మ  రాజ్యంలో  కడప బిడ్డలు అంటు  సినిమా టైటిల్ ను మార్చాడు. ఆ తర్వాత సెన్సార్ నుండి గ్రీన్ సిగ్నల్ రాగా ఈ నెల 12న వర్మ అమ్మ  రాజ్యం లో కడప బిడ్డలు  సినిమాని విడుదల చేయబోతున్నాడు. కాగా  ఈ సినిమాకి తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు రాంగోపాల్ వర్మ. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి  చేసిన మాదిరిగానే తన సినిమాలోని పాత్రల ఫోటోలను మార్పింగ్ చేస్తూ ప్రమోషన్స్ చేసేస్తున్నాడు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ వైసీపీఎంపీ విజయసాయిరెడ్డి లు  తన సినిమా విడుదల తేదీని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్న తో ఫోటోలు మార్ఫింగ్  చేశాడు. 

 

 

 

 ఇక తాజాగా మరో ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్. కేపాల్ వర్మకు సర్టిఫికెట్ ఇస్తున్నట్లుగా ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్లను ఆకర్షిస్తూ వైరల్ అయిపోతుంది. అయితే దీనిపై స్పందించిన కే ఏ పాల్ కోడలు బెగాల్ జ్యోతి పోలీస్ స్టేషన్ లో  వర్మ పై కేసు నమోదు చేసింది. గతంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు తాము దిగిన ఫోటోలను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని.. రామ్ గోపాల్ వర్మ పై చర్యలు తీసుకోవాలి అంటు  పోలీసులకు ఫిర్యాదు చేసింది జ్యోతి . అయితే జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐసీసీ 469 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: