సాధారణంగా అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఎప్పుడైనా ఎక్కడైనా వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది అది తెలంగాణ లో అయినా ఆంధ్రప్రదేశ్ లో అయినా. కానీ విచిత్రంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పైన  టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఎందుకో అని అనిపించొచ్చు ఎందుకో అని ఆరా తీయగా  సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన  గణబాబు జగన్‌పై పొగడ్తలు వర్షం కురిపించారు సీఎం జగన్మోహన్ రెడ్డికి గ్రౌండ్ లెవల్ సమాచారం కరెక్ట్‌గా వస్తోంది అని  క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతోందో సమాచారం కచ్చితంగానే తెప్పించుకుంటున్నారు అని అది అతడి ప్రతిభ నేనని ఇందులో చెప్పుకోవడానికి గాని విమర్శించడానికి కానీ ఏమి లేదు అన్నారు.సాధారణంగా అతడు  ఇలా మాట్లాడిన మాటలు వింటే ఎవరైనా వైసీపీ లో కి చేరుతారేమో నని అనుమానాలు వస్తున్నాయని గుసగుసలు వినిపిస్తుంన్నాయి.

అలాగే గణబాబు అంతటితో ఆగక సీఎం జగన్  ఇంటెలిజెన్స్ ద్వారా కాకుండా సొంత మార్గాల్లో సీఎం కచ్చితమైన  సమాచారం తెప్పించుకుంటున్నారు అని మెచ్చుకున్నారు. మొన్న విశాఖలో జరిగిన సమీక్షలో ఈ విషయం స్పష్టమైంది అని చెప్పుకొచ్చారు. గణబాబు వ్యాఖ్యలు మరోసారి టీడీపీలో చర్చనీయాంశమయ్యాయి. గణబాబు టీడీపీకి గుడ్ బై  చెప్పి వైసీపీ లేదా బీజేపీ తీర్థం పుచ్చుకుబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈయన వ్యవహారం తెలుగుదేశంలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే అతడు స్పందిస్తూ ఇటివల అయన   మీడియాతో మాట్లాడుతూ నేను టీడీపీ ని వదిలి వెళ్తున్నాని పార్టీ మారతారంటూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.

అదేమీ నిజం కాదు అని పార్టీని వదిలి వెళ్ళేది లేదని  తాను పార్టీ మారుతాననేది అంత పుకారులేనని  అన్నారు. ఇదంతా మీడియా ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు  సృష్టిస్తారని అందులో భాగమే ఆ ప్రచారమని అన్నారు. ఎవరికైనా పార్టీ మారే ఆలోచన ఉంటే వాళ్లే మీడియా ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: