అత్యాచారం, హత్య మరియు షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌ ల తదనంతరం ఎన్‌కౌంటర్‌ ను దేశం అంత హర్షిస్తున్న సమయంలో ఈ అంశాన్ని కేంద్రం  రాద్ధాంతం  చేస్తుందని ప్రజలు అనుకుంటున్న   సమయంలో ఒక మీడియా సభ్యుడు  ఈ అంశంపై   సుప్రీం కోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన రెడ్డి ఏమనుకుంటున్నారు అన్న ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చారు. షాద్ నగర్‌లో జరిగింది ఎన్‌కౌంటర్ అని నేనే కాదు ఈ దేశంలో ఎవరూ అనుకోవడంలేదు అని  ఆ విషయం అందరికి తెలుసు  వాళ్లను కాల్చి చంపారనే విషయం కానీ వారు చేసిన పని  వల్ల వాళ్ళను చంపిన విషయం పెద్దగా కనబడటంలేదు అని స్పందించారు.

ఎన్‌కౌంటర్ అంటే రెండు వర్గాల మధ్య జరిగే  పోరు అని  కాల్పులు అని, ఇరువైపుల ఘర్షణ వాతావరణం అని, ఆ ఘర్షణలో ఎవరైనా చనిపోతే దాన్ని ఎన్‌కౌంటర్ అంటారు. ఈ కేసులో ఆ పిల్లలను తీసుకెళ్లి నేరపరిశోధన పేరుతో కాల్చిచంపారని అనుకుంటున్నానని ప్రకటించారు. దానికి విలేకరి పోలీసులకు కూడా దెబ్బలు తగిలాయి కదా అని

నిందితులు రాళ్లతో దాడి చేయడం వల్లే ఆత్మరక్షణ కోసం దాడి చేశామని పోలీసులు చెబుతున్నారు కదా అని అడిగిన ప్రశ్నకు  తప్పించుకోడానికి వారిని చంపడం తప్పితే వేరే మార్గం లేదనే సందర్భంలో ఆత్మరక్షణ అనే అంశం వస్తుంది.  ఆత్మరక్షణ అంటే ఆయుధంతో అవతలి వ్యక్తిని చంపడం కాదు. అవతలి వ్యక్తి చేసిన బలప్రయోగానికి సమానంగా బలప్రయోగం ఉండాలి కానీ, కొంత మంది పోలీసులుఇరవై ఏళ్లు నలుగురిని చంపి ఎన్‌కౌంటర్ అని ఎలా అంటారు అని ఆత్మరక్షణ కొరకు జరిపిన కాల్పులు అని ఎలా అంటారు అని ప్రతిఘటించారు దీన్ని ఎన్ కౌంటర్ అని చర్చించుకోవడం దురదృష్టకరం  అని పేర్కొన్నారు.

ఈ విషయంలో మీడియా పోషించిన పాత్ర చాలా దురదృష్టకరం అని నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సిన మీడియా కూడా వారిని అన్యాయం చేసిందని  కంటికి కన్ను అనే సిద్ధాంతం వల్ల ప్రపంచం గుడ్డిదవుతుంది అని విమర్శించారు. సౌదీ అరేబియాలాంటి దేశాలు మనకు  ఆదర్శం కావు అని వారి జీవన పద్ధతులు 

వేరే అని వివరించారు. అత్యాచార అభియోగం ఉంటే  ఇండియాలో చాలా మందికి ఇదే పరిస్థితి ఏర్పడుతుంది  అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. అభియోగాలు ఉన్నవారు చట్టసభల్లో చాలా మంది ఉన్నారని వారిని ఏం చేద్దాం అని  వారిని కూడా మీరనే భాషలో ఎన్‌కౌంటర్ చేయోచ్చునా అని ప్రశ్నించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: