గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంతో ఓడిపోయింది జ‌న‌సేన పార్టీ. అయినా కూడా ఆయ‌న‌లో మార్పు రాలేదు. కానీ పవన్‌లో ఆ మార్పు రాకపోగా మరింతగా పతనావస్థకు దిగజారుతూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రిని రెచ్చగొట్టడం ద్వారా లబ్ది పొందాలని ఆయన చూస్తున్నారని, ఇదే ఆయన వ్యూహమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయంలో తన పాత్ర ఏమీ లేకపోవడంతో తరచూ ఏదో ఒక వివాదాస్పద ప్రకటన చేసి హైలెట్‌ అయ్యేందుకు, ముఖ్యమంత్రిని లక్ష్యం చేసుకుని విమర్శలు చేయడం ద్వారా తాను ఉన్నానని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయనపై పవన్‌ ఎన్నికలు వచ్చే వరకూ ఒక్క వ్యతిరేక ప్రకటన చేయలేదు. ఎన్నికల కోసం రహస్య అజెండాలో భాగంగా చంద్రబాబును కొంత మేర తిట్టినా వారిద్దరూ రహస్య స్నేహితులని జనం నమ్మారు. అందుకే ఆంధ్రా జనం ఆయన్ను గుర్తించకుండా అసెంబ్లీలో కూడా అడుగు పెట్టకుండా చేశారనే వాదన ఉంది.

 

అయినా పవన్‌ తన పంథా మార్చుకోకుండా చంద్రబాబు చెప్పుచేతల్లోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈమధ్య ఢిల్లీ వెళ్లి వచ్చాక బీజేపీకి అనుకూలంగా ఆయన వైఖరి మారింది. అందుకే ఈ కుల‌మాతాలమీద జోరుగా ప్రసంగిస్తున్నారు. దీన్నిబట్టి మోడీ, అమిత్‌షా ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

 

ప్రజా సమస్యలపై పని చేయకుండా ఇక మీదట రెండు నెలలకోసారి ఏదో స్పాన్సర్డ్‌ మీటింగ్‌ పెట్టుకుని ఏదో ఒక వివాదాస్పద ప్రకటన చేయడానికే ఆయన పరిమితమవుతున్నారనే వాదన ఉంది. అందులోభాగంగానే ముఖ్యమంత్రిని టార్గెట్‌ చేసుకుని విమర్శిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ దీనివల్ల ఆయన ఇమేజ్‌ మరింత డ్యామేజ్‌ అవుతుందని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయాల్లో ఇలాంటి ట్రిక్స్‌ ద్వారా ఎవరూ లబ్ది పొందలేదనే విషయాన్ని ఆయన గ్రహిస్తే మంచిది.

 

జగన్‌రెడ్డిని నేను ముఖ్యమంత్రిగా గుర్తించను.. తిరుపతిలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన కామెంట్‌ ఇది. పరిపక్వత లేని రాజకీయ నాయకుడిగా ఇప్పటికే పవన్‌కు చాలా గుర్తింపు వచ్చింది. తనను తాను మేధావిగా, విప్లవ వీరుడిగా చూపించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రాథమిక రాజకీయ అవగాహన ఆయనకు లేదనడానికి ఇలాంటి ప్రకటనలే ఉదాహరణ. అధికారపక్షంతో, ముఖ్యమంత్రితో ఆయనకు ఎన్ని విభేదాలైనా ఉండవచ్చు. అంత మాత్రాన ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా గుర్తించనని అనడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని రాజకీయ పండితులు చెబుతున్నారు. పవన్‌ గుర్తించనంత మాత్రాన జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా పోతారా?.

 

50 శాతం ఓట్లతో 151 సీట్లతో భారీ మెజారిటీతో జగన్‌ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఈ తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. నేను గౌరవించనని పవన్‌ కళ్యాణ్‌ అంటే ఎవరికి నష్టం. ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న వ్యక్తి చాలా సంయమనంగా, ఆలోచనతో, వివేచనతో నడవాలి. కానీ పవన్‌ కళ్యాణలో ఏనాడు ఆ వివేచన కనిపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: