అనుజ గుప్తా ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్‌  ఆయన అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. శనివారం నుంచి అనుజ్‌ గుప్తా కనిపించకుండా పోయి  ఉత్తరాఖండ్‌లోని హరిద్వారాలో శవమై కనిపించారు. ఆయన మృతదేహాన్ని గంగ్‌నహర్‌ కాలువపై ఉన్న పాత్రి పవర్‌హౌజ్‌ వద్ద  గుర్తించారు. వివరాల్లోకి వెళితే..  ఢిల్లీ ద్వారకాలోని సత్యం అపార్ట్‌మెంట్‌లో అనుజ్‌ నివాసం ఉంటున్నారు. అయితే శనివారం సాయంత్రం హరిద్వార్‌లోని   ఆయన  ఓ హోటల్‌కి వెళ్లారు.

 

ఆ తర్వాత బయటకు వెళ్లిన అనుజ్‌.. రాత్రి సమయంలో హోటల్‌ రూమ్‌కు తిరిగివచ్చారు. అయితే సాయంత్రం ఆదివారం ఉదయం 11 గంటలైనప్పటికీ అతను తన రూమ్‌ డోర్‌ తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన హోటల్‌ సిబ్బంది.. డోర్లు కొట్టి చూసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. హోటల్  బుకింగ్‌లో అనుజ్‌ ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌కు వెంటనే హోటల్‌ సిబ్బంది కాల్‌చేశారు. కానీ తన తండ్రి శనివారం నుంచి కనిపించడం లేదని ఆ ఫోన్‌ ఎత్తిన అనుజ్‌ కుమారుడు చెప్పాడు ,  పోలీసులకు  కూడా ఈ విషయమై ఫిర్యాదు చేశామని హోటల్‌ సిబ్బందికి అనుజ్‌ కుమారుడు తెలిపాడు.

 

దీంతో హోటల్‌ సిబ్బంది.. అనుజ్‌ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం వారి సమక్షలంలో అనుజ్‌ రూమ్‌ను తెరిచారు.కానీ  అందులో అతడు కనిపంచలేదు..  అయితే పోలీసులు ఫ్లోర్‌పై మాత్రం రక్తపు మరకలను  వున్నా విషయాన్ని గుర్తించారు. అనంతరం సీసీటీవీ దృశ్యాలు కూడా పరిశీలించిన పోలీసులు రాత్రి 11 గంటలకు గుప్తా హోటల్‌ రూమ్‌ నుంచి బయటకు వెళ్లినట్టు గుర్తించారు. 

 

కాగా, పోలీసులు అనుజ్ ఎడమ చేతి మణికట్టుపై బ్లేడుతో కోసిన గాయాలు ఉండటం, హోటల్‌ రూమ్‌లో బ్లేడ్‌ లభించడంతో అతను అత్మహత్యకు పాల్పడి ఉంటారని  భావిస్తున్నారు. అయితే అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టమ్‌ అనంతరం అనుజ్‌ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: