వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా రూపొందిన వెంకీమామ సినిమా ఎట్టకేలకు ఈ డిసెంబర్ 13న విడుదల కాబోతోంది. అయితే ఇటీవల ఏ సినిమాకూ రానన్ని విడుదల కష్టాలు ఈ సినిమాకు వచ్చాయి. నిర్మాత సురేశ్ బాబు తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓ సినిమా విడుద‌ల విష‌యంలో ఇంత గంద‌ర‌గోళానికి గుర‌య్యారు. చాలా త‌ర్జన భ‌ర్జన‌ల త‌ర్వాత `వెంకీమామ‌`ని ఈ నెల 13న విడుద‌ల చేయాల‌ని నిర్ణయించారు.

 

అసలు ఈ సినిమాని మొద‌ట ద‌స‌రాకే విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ నిర్మాత సురేష్ బాబు జీవితంలో గ‌తేడాది చాలా సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. అందుకే రెండు నెల‌ల‌పాటు ఆయన అమెరికాలోనే గ‌డ‌పాల్సి వ‌చ్చింది. అయినా ద‌స‌రాకి విడుద‌ల చేద్దామ‌ని ప్ర‌య‌త్నించాం కానీ... వెంక‌టేష్ కాలికి గాయ‌మైంది. ఆ త‌ర్వాత దీపావ‌ళికి అనుకున్నారు. కానీ, రాశిఖ‌న్నా డేట్లు స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో మిగిలిన ఒక్క పాట‌ని చిత్రీక‌రించ‌లేక‌పోయారు. అలా దీపావ‌ళికి కూడా రాలేక‌పోయారు.

 

దాంతో వెంకీమామను సంక్రాంతికి విడుద‌ల చేస్తారనే పుకారొచ్చింది. కానీ సురేశ్ బాబు ఆ దిశ‌గా అస్సలు ఆలోచ‌న చేయ‌లేదు. ఎందుకంటే అప్పటికే మూడు సినిమాల విడుద‌ల తేదీలు ఖ‌రార‌య్యాయి. పైగా వెంక‌టేష్‌కి అంద‌రితో మంచి అనుబంధం ఉంది.

 

అందుకే మ‌ధ్యేమార్గంగా మేం క్రిస్ మ‌స్ కూడా క‌లిసొస్తుంద‌ని ఈ నెల 13న విడుద‌ల తేదీగా ఖ‌రారు చేశారు. మ‌హిళ‌ల‌కి కూడా న‌చ్చే అంశాలు ఉన్నాయి కాబ‌ట్టి, సంక్రాంతి వ‌ర‌కు కూడా ఈ సినిమా ఆడుతుంద‌నే భరోసాతో ఉన్నారు నిర్మాత సురేశ్ బాబు. మరి వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 2 సూపర్ హిట్ అయ్యింది. మరి నాగ చైతన్యతో వెంకటేశ్ కాంబినేషన్ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: